సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఏ పని చేసినా నెట్టింట తెగ వైరల్ అవుతుందనే సంగతి తెలిసిందే.మహేష్ బాబుకు ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా రాజమౌళి( Rajamouli ) సినిమా షూటింగ్ తో మహేష్ బాబు బిజీగా ఉన్నారు.
తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ బాబు ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.రాజమౌళి సినిమాకు సంబంధించి మహేష్ బాబు లుక్ ఫైనల్ అయిందని త్వరలో ఈ సినిమా షూట్ మొదలుకానుందని తెలుస్తోంది.
హైదరాబాద్( Hyderabad ) శివార్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది.మహేష్ బాబు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులను తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహేష్ బాబు కొనుగోలు చేసిన ఈ ఆస్తుల విలువ 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంటుందని సమాచారం అందుతోంది.
మహేష్ బాబు ఇప్పటికే థియేటర్లు, రెస్టారెంట్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి ఆ వ్యాపారాల ద్వారా ఊహించని స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.మహేష్ బాబు స్టార్ హీరోగా సక్సెస్ కావడంతో పాటు సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ అనిపించుకుంటున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.మహేష్ బాబు కథల ఎంపికలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు రెమ్యునరేషన్( Mahesh Babu Remuneration ) విషయంలో సైతం టాప్ లో ఉన్నారు.100 కోట్ల రూపాయల రేంజ్ లో మహేష్ బాబు పారితోషికం తీసుకుంటూ ఇండస్ట్రీలోని ఇతర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.రీజినల్ సినిమాలతో సైతం ఓటీటీలలో మహేష్ బాబు రికార్డులు క్రియేట్ చేస్తూ వ్యూస్ విషయంలో సంచలనాలు సృష్టిస్తున్నారు.