ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించాలన్నా ఎంతో కష్టపడాలి.ఒకే వ్యక్తి మూడు ఉద్యోగాలు సాధించడం అంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే ఒక గిరిజన బిడ్డ మాత్రం పోటీ పరీక్షలలో సత్తా చాటి ప్రశంసలు అందుకుంటున్నారు.మహేశ్వరంలోని కేబీ తండాకు చెందిన నేనావత్ స్వాతి( Nenavath Swathi ) తన సక్సెస్ తో ప్రశంసలు అందుకుని వార్తల్లో నిలుస్తున్నారు.
పేద కుటుంబానికి చెందిన స్వాతి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కుటుంబ బాధ్యతలు మోస్తూ పీహెచ్డీ పూర్తి చేశారు.కొడుకును చూసుకుంటూనే లక్ష్యాన్ని సాధించి ఆమె ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.
భర్త, తల్లీదండ్రులు సహాయసహకారాలు అందించడం వల్లే సులువుగా సక్సెస్ సొంతమైందని ఆమె చెబుతున్నారు.జూనియర్ కాలేజ్ లో కెమిస్ట్రీ లెక్చరర్( Chemistry Lecturer ) ఉద్యోగంతో పాటు పీజీటీ ఫిజికల్ సైన్స్ టీజీటీ ఫిజికల్ సైన్స్ ఉద్యోగాలకు ఆమె ఎంపికయ్యారు.

పేదరికం అనుభవిస్తూ కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని భావించే ఎంతోమందికి ఆమె సక్సెస్ స్టోరీ( Success Story ) స్పూర్తిని కలిగిస్తుందని చెప్పవచ్చు.తల్లీదండ్రులు కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారని ఆమె చెబుతున్నారు.బాల్యం నుంచి చదువు కోసం ఎన్నో కష్టాలను అనుభవించానని ఆమె చెప్పుకొచ్చారు.ఈ సక్సెస్ అంత సులువుగా దక్కలేదని స్వాతి పేర్కొన్నారు.

నేను అనుభవించిన కష్టాలు మామూలు కష్టాలు కావని స్వాతి అభిప్రాయం వ్యక్తం చేశారు.ఐఐసీటీ హబ్సిగూడలో ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నానని స్వాతి వెల్లడించారు.స్వాతి చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. స్వాతి టాలెంట్ ను ఎంత ప్రశంసించినా తక్కువేనని ఆమె పేర్కొన్నారు.అడవి బిడ్డ ఈ స్థాయిలో సక్సెస్ సాధించడం అంటే ఆషామాషీ విషయం కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.స్వాతి సక్సెస్ ను ఎంత మెచ్చుకున్నాతక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







