మహబూబ్ నగర్( Mahbub Nagar ) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించింది.ఈ మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ నవీన్ కుమార్ రెడ్డి( N Naveen Kumar Reddy ) పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
కాగా ఇప్పటికే ఈ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ నెల 28న పోలింగ్ జరగనుంది.
అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కసిరెడ్డి నారాయణ రెడ్డి ( Kasireddy Narayana Reddy )ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.దీంతో ఖాళీ అయిన మహబూబ్ నగర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.







