ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు( Muslims ) అతి పవిత్రంగా భావించే మాసం రంజాన్.ఈ మాసంలో కఠినమైన ఉపవాసాలు నమాజులు చేసుకుంటూ.
భగవంతుని నామస్మరణ చేస్తుంటారు.ఈ మాసంలో దానధర్మాలు ఎక్కువగా చేస్తారు.
సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేచి స్నానాలు చేసి.కొద్దిగా ఆహారం తీసుకుని ఉపవాసం స్టార్ట్ చేసి… సూర్యాస్తమయం వరకు.
మంచినీరు కూడా తాగకుండా కఠినంగా ఉంటారు.రంజాన్ మాసంలో చాలామంది ముస్లింలు ఐదు పూటలా నమాజ్ అవలంబిస్తారు.
ఎంతో భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో పాటు.భగవంతుని నామ స్మరణ చేస్తుంటారు.
ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగO Ramzzan Festival )ను ముస్లిం దేశాలు.ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాయి.

ఇదిలా ఉంటే వచ్చే వారంలోనే రంజాన్ మాసం మొదలుకానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు( Muslim Employees ) శుభవార్త తెలియజేయడం జరిగింది.విషయంలోకి వెళ్తే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు( Out Sourcing Employees ) గంట ముందే ఇంటికి వెళ్లేలా వెసులుబాటు కల్పించడం జరిగింది.మార్చి 12 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది.ఆరోజు నుంచి ఏప్రిల్ 14 వరకు సాయంత్రం నాలుగు గంటలకే విధులు ముగించుకుని ఇంటికి వెళ్లొచ్చని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ముస్లిం ఉద్యోగస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







