టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ( YCP Chelluboina Venugopala Krishna ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.
బీసీలను మోసం చేయడం చంద్రబాబు( Chandrababu )కు అలవాటని పేర్కొన్నారు.చంద్రబాబు ప్రభుత్వ హయాంలో బీసీలకు చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు.

సీఎం జగన్ ( CM Jagan )బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్న మంత్రి చెల్లుబోయిన జగన్ కులగణన కూడా పూర్తి చేశారని చెప్పారు.దీన్ని త్వరలోనే ప్రకటిస్తారని వెల్లడించారు.







