AI Teacher : వైరల్: మహిళ ఏఐ టీచరమ్మ దెబ్బకు ఇక స్కూల్లో టీచర్ల ఉద్యోగాల పరిస్థితి ఏంటో..?!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ( Technology ) విస్తరిస్తున్న నేపథ్యంలో అనేక పనులు మనం చిటికలో చేయగలుగుతున్నాం.

ఇందులో ముఖ్యంగా ఏఐ( AI ) టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి.

దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయింది.

ఈ టెక్నాలజీని ఉపయోగించి చాలామంది వారి పనులను సులభతరం చేస్తుంటే.మరికొందరు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పవచ్చు.

ఈ టెక్నాలజీ కొంతమంది సెలబ్రిటీలకు కాస్త ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు.ముఖ్యంగా వారి ముఖం మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో నానా రకాల వీడియోలను వదులుతున్నారు.

Advertisement

ఇకపోతే ఈ టెక్నాలజీ మొన్నటి వరకు ఐటీ కంపెనీలలో మాత్రమే ఉండగా ఇప్పుడు ఇది కాస్త స్కూల్స్ వరకు వచ్చేసింది.

తాజాగా ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకొని ఓ టీచరమ్మ కేరళలో( Kerala ) ప్రత్యక్షమైంది.కేరళ రాజధాని తిరునంతపురంలో ఓ స్కూల్లో ఈ టెక్నాలజీ కలిగి ఉన్న మహిళ టీచర్ ని ప్రవేశపెట్టారు.కొచ్చి నగరానికి చెందిన ఓ స్టార్టప్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.

ఈ మహిళ ఏఐ టీచరమ్మ( AI Teacher ) పిల్లలకు పాఠాలు ఎలా చెబుతుందోనని స్కూల్లో విద్యార్థుల మధ్య ఉంచి దానిని పర్యవేక్షించారు.ఇక ఈ టీచరమ్మ చూడటానికి అచ్చం భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చీర కట్టుకొని సాంప్రదాయబద్ధంగా ఉండేలా దీనిని రూపొందించారు.

ఈ క్రమంలోనే ఈ టీచరమ్మ ఏకంగా ఒకేసారి 3000 మందికి పాఠాలు చెప్పడం మాత్రమే కాకుండా అందులో అర్థం కాని వాటిని పదేపదే చెబుతూ అలాగే వారి సందేహాలను తీర్చింది.

విరుపాక్ష తర్వాత సంయుక్త మీనన్ కి ఏమైంది ? ఆమె జోరు ఎందుకు తగ్గిపోయింది ?
మెగాస్టార్ విశ్వంభరలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారా.. అలా జరిగితే ఫ్యాన్స్ కు పండగే!

ఈ టీచర్ అమ్మ మొత్తం మూడు భాషల్లో మాట్లాడగల నాలెడ్జ్ ఈ సాఫ్ట్వేర్ లో జోడించడంతో ఆటోమేటెడ్ టీచింగ్ టూల్స్( Automated Teaching Tools ) కంటే అడ్వాన్సుడ్ గా పనిచేస్తుంది.ఈ టెక్నాలజీ ద్వారా అచ్చం లేడీ టీచర్ పాఠశాలల విద్యార్థులకు ఎలా పాఠాలు చెబుతుందో., అలాగే ఎవరైనా మనుషులు ఎదురైతే వారిని ఎలా పలకరిస్తుందో అచ్చం అలాగే చేయడంతో.

Advertisement

ఈ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసిన కంపెనీ సీఈఓ హరిసాగర్ సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ ఏఐ లేడీ టీచర్ పాటాలు విద్యార్థులకు బాగా అర్థమవుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు.

ఇలాంటి లేడీ ఏఐ టీచర్లను ముందుముందు అనేక స్కూల్లో ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన తెలియజేశారు.చూడాలి మరి పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు టీచర్ల పరిస్థితి ఎలా ఉంటుందో మరి.

తాజా వార్తలు