ఖాళీ కడుపుతో( Empty Stomach ) ఏం తింటున్నారు అనేది చాలా ముఖ్యం.ఎందుకంటే రాత్రంతా ఏమి తినకుండా ఉంటాము.
అలాగే కడుపులోని ఇతర ఆహారాలన్నీ జీర్ణమైన తర్వాత మనం తినే ఫుడ్ కూడా ఇదే.కాబట్టి ఉదయాన్నే మనం తినే ఆహారం కడుపుని సులభంగా ప్రభావితం చేస్తుంది.అది చెడు ఆహారం అయితే దాని ప్రకారం చెడు ప్రభావాలు ఉంటాయి.ఉదయాన్నే కాళీ కడుపుతో మనం తీసుకునే ఆహారం మంచిది అయితే ప్రభావం కూడా బాగుంటుంది.
ఏమైనా గానీ కాళీ కడుపుతో తినదగిన, తినకూడని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో నీరు తాగడం చాలా మంచిది.అలాగే గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ రసం( Lemon Juice ) పిండుకొని కూడా తాగవచ్చు.ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.
అలాగే గ్రీన్ టీ కూడా ఖాళీ కడుపుతో తాగడం చాలా మంచిది.ఇది అంతర్గత అవయవాలు పనితీరును కూడా సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.
ఇది కొవ్వును కాల్చడంలో కూడా సహాయపడుతుంది.ఖాళీ కడుపుతో ఓటు మిల్ తినడం కూడా చాలా మంచిది.
ఇందులోని పీచు పదార్థం ఆకలిని అణిచివేసి అతిగా తినకుండా చేస్తుంది.గుడ్లు( Eggs ) కూడా చాలామంది ఉదయం పూట తినే వంటకం.
ఖాళీ కడుపుతో గుడ్లు తినవచ్చా లేదా అన్న సందేహం చాలా మందికి ఉంటుంది.
అయితే గుడ్లు ఖాళీ కడుపుతో కూడా తినవచ్చు.గుడ్లు ప్రోటీన్ ఇతర అద్భుతమైన పోషకాలను అందించడంలో ఎంత గానో సహాయపడతాయి.బెర్రీలు, బాదం, చియా గింజలు కూడా ఖాళీ కడుపుతో తినడానికి మంచి ఆహారాలు.
అలాగే చాలామంది ఉదయం లేవగానే కాఫీలు తాగుతూ ఉంటారు.అయితే ఖాళీ కడుపుతో కాఫీ( Coffee ) తాగకూడదు.
అలాగే ఖాళీ కడుపుతో స్పైసీ ఫుడ్స్ కూడా తినకూడదు.అలాగే ఖాళీ కడుపుతో సీట్రస్ పండ్లను( Citrus Fruits ) కూడా అసలు తినకూడదు.
అలాగే కార్బోనేటెడ్ డ్రింక్స్, శీతల పనియాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది.అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన ఆహారాలు కూడా ఖాళీ కడుపుతో తీసుకోకూడదు.