తరచూ సోషల్ మీడియా( Social Media )లో సెలబ్రెటీలకు సంబంధించిన అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి.సెలబ్రిటీ హోదా ఒకసారి దక్కింది అంటే చాలు వారికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి.
సెలబ్రిటీలు( Celebrities ) కూడా వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు.ఇది ఇలా ఉంటే తాజాగా ప్రముఖ నటి బిగ్ బాస్ బ్యూటీ శ్వేతా వర్మ( Bigg Boss Swetha Varma ) చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల తనను బాడీ షేమింగ్( Body Shaming ) చేసిన వారిపై ఫైర్ అవుతూ ఒక పోస్ట్ చేసింది.అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ.అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.తాజాగా, శ్వేతా వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.ఒక స్పానిష్ మహిళ( Spanish Woman ) ట్రావెలింగ్ చేస్తుండగా ఆమెను కొందరు గ్యాంగ్ రేప్ చేసిన విషయం తెలిసిందే.ఈ విషయంపై శ్వేతా స్పందిస్తూ.
కన్నీళ్లు ఆగడం లేదు.నన్ను ఈ ఘటన ఎంతగానో బాధ పెట్టింది.
ఆడదాని శరీరాన్ని తాకాలని, రేప్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది.ఆమెను ఎందుకు బాధ పెట్టాలి.
ఆమె భర్తను ఎందుకు అలా గాయపర్చాలి అలా చేసిన వారి మీద నాకు చాలా కోపం వస్తుంది.నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను.మీరు ధైర్యంగా ఉండండి మేము మీ వెంట ఉంటాం.తప్పు చేసిన రాక్షసులకు శిక్ష పడేలా చేద్దాం.అసలు ఇలా జరగకుండా ఉండాల్సింది.మా దేశంలో జరగడం నన్ను బాధిస్తుంది.
మేము ఫెయిల్ అయ్యాము క్షమించండి.ఇంతకంటే నేను ఇంకా ఏమీ చెప్పలేను అంటూ రాసుకొచ్చింది.
అంతేకాకుండా ఆ భార్యా భర్తల వీడియోను షేర్ చేసింది.ప్రస్తుతం శ్వేతా పోస్ట్ వైరల్( Viral Post ) అవుతోంది.
అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.