2015 వ సంవత్సరంలో కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమా( Srimanthudu movie ) సూపర్ సక్సెస్ ని అందుకుంది.అయితే ఈ సినిమా విషయంలో అప్పట్లో ఒక వ్యక్తి ఈ స్టోరీ నాది అనే ఆరోపణలు చేయడమే కాకుండా ఆయన తెలంగాణ హైకోర్టులో కేసు కూడా ఫైల్ చేశాడు.
ఇక ఈ సినిమా హీరో అయిన మహేష్ బాబు, రైటర్ అండ్ దర్శకుడు అయినా కొరటాల శివ పైన కేసు వేసినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.
ఇక దానికి సంబంధించిన న్యాయ విచారణ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.అయితే హైకోర్టులో ఈ కథ రచయిత అయిన శరత్ చంద్ర కి మద్దతుగా కోర్టు నుంచి తీర్పు వచ్చింది.ఇక దాంతో శరత్ చంద్ర( Sarat Chandra ) ఈ కేసుని సుప్రీంకోర్టులో వేసినట్టు గా తెలుస్తుంద.
ఇక ఈ కేసులో కనక శరత్ చంద్ర వైపు న్యాయం ఉందని తెలిస్తే మహేష్ బాబు కొరటాల ఇద్దరు జైలుకు పోవాల్సిందేనా అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఇక మొత్తానికైతే కొరటాల శివ, మహేష్ బాబు ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
అయితే అప్పుడెప్పుడో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్టు కూడా సంపాదించుకుంది ఇక మహేష్ బాబుకి అప్పటివరకు కొన్ని ప్లాపులు వచ్చిన కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అయితే దక్కింది.ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఆ తర్వాత ‘భరత్ అనే నేను ‘ సినిమా కూడా వచ్చింది.ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో మంచి గిరాకీ అయితే పెరిగింది అనే చెప్పాలి…ఇక ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ ప్రేక్షకులు, అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.