ప్రతినిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు కనపడడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇకపోతే సమాజంలో రోజురోజుకి కేటుగాళ్లు, మాయగాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు.
దీనికి కారణం డబ్బు.ఎంత ధనం ఉన్నా కానీ కొందరు మాత్రం మోసాలు, దగాలు చేసి కాలం గడిపేస్తున్నారు.
వీళ్ళతో పోల్చుకుంటే నిజానికి ప్రతిరోజు కూలికి వెళ్లి డబ్బులు సంపాదించే వాళ్ళు చాలా మేలని చెప్పవచ్చు.వారు సంపాదించిన దాంట్లోనే కడుపునింపుకుంటూ.
పక్కనోడి సొమ్ము పై ఆశపడకుండా కడుపు నింపుకుంటున్నారు.ఇక అసలు విషయంలోకి వెళితే.
తాజాగా హైదరాబాదులో( Hyderabad ) ఓ ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి రోడ్డుపై ఆగి ఉన్న ఆటో ట్రాలీలో నుంచి గ్యాస్ సిలిండర్( Cylinders ) ని అమాంతం దొంగలించారు.ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.హైదరాబాద్ మహానగరం లోని మాదన్నపేటలో ( Madannapet )ఉన్న భార్గవి ఏజెన్సీకి చెందిన ఓ ఆటో ట్రాలీ గ్యాస్ సిలిండర్లు డెలివరీ కి వెళ్ళగా ఆటోను మెయిన్ రోడ్డు పై పెట్టి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడానికి వెళ్ళాడు.అయితే ఈ సంగతిని గమనించిన ఓ ఇద్దరు యువకులు కారు తీసుకుని వచ్చి ఆటో వెనకాల వచ్చి ఆపారు.
ఆ తర్వాత చుట్టుపక్కల జన సమూహాన్ని గమనిస్తూ.ఆటో ట్రాలీ దగ్గర ఎవరూ లేరని నిర్ధారణకు వచ్చిన తర్వాత, ఓ సిలిండర్ ను తీసుకొని కారులో వేసుకొని అక్కడి నుంచి ఉడాయించారు.ఈ దృశ్యాలని అక్కడే ఉన్న సిసిటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవడంతో అసలు విషయం బయటపడింది.ఏదేమైనా ఇలా కార్ ఉన్న కానీ చివరికి సిలిండర్ దొంగతనం చేయడంతో వారిపై నెటిజన్స్ మండి పడుతున్నారు.
దీనిపై గ్యాస్ ఏజెన్సీ పోలీస్ కంప్లైంట్ చేయడంతో గ్యాస్ సిలిండర్ దొంగల కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ని మొదలెట్టేశారు.