యంగ్ రెబల్ స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ప్రభాస్( Prabhas ) తనదైన రీతిలోనే భారీ సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రికార్డ్ లను క్రియేట్ చేశాడనే చెప్పాలి.ఇక మొదట్లో ఈయన చేసిన మొదటి రెండు సినిమాలు మినహాయిస్తే ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మినిమం గ్యారంటీగా ఆడిన సినిమాలే కావడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ఆయన రెండో సినిమా అయిన రాఘవేంద్ర సినిమా( Raghavendra ) సమయంలో దర్శకుడు సురేష్ కృష్ణ( Suresh Krissna ) కి ప్రభాస్ కి మధ్య ఒక సీన్ విషయంలో మిస్ అండర్ స్టాండింగ్ జరిగినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.

ఇక ఈ సినిమాలో సిమ్రాన్ తో ఒక పాట ఉంటుంది.ఆ పాటలో డ్యాన్స్ చేయడం లో ప్రభాస్ కొంచెం తడబడ్డాడట…అయితే ఆ రోజుకి సాంగ్ కి ప్యాకప్ చెప్పాల్సిన సమయం వచ్చేసింది.దాంతో సురేష్ కృష్ణ ఈ సాంగ్ షూట్ ను తొందరగా కంప్లీట్ చేయండి అని కొంచెం కోపం తో చెప్పాడట.దాంతో డైరెక్టర్ తన మీద కోపంగా ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకున్న ప్రభాస్ కొంతసేపు మూడీగా కూర్చుని ఉన్నాడంటా… దాంతో ప్రభాస్ మూడీగా ఉండడం గమనించిన సురేష్ కృష్ణ( Suresh Krissna ) తను ఎందుకు ప్రభాస్ మీద కోపానికి రావాల్సి వచ్చిందో క్లియర్ కట్ గా ప్రభాస్ కి తెలియజేశారట.

అది ఎందుకు అంటే ఆ రోజే సాంగ్ షూటింగ్ చివరి రోజు కావడంతో ఆయన చేయాల్సిన పోర్షన్ ఇంకా ఎక్కువగా ఉండిపోవడం ఒకటైతే ఆ సాంగ్స్ ఎంతసేపటికి అవ్వకపోవడంతో కోపానికి వచ్చినా సురేష్ కృష్ణ తొందర గా షూటింగ్ కంప్లీట్ చేయండి అని చెప్పాను అని ఆయన ప్రభాస్ కి ఒక క్లారిటీ ఇచ్చాడట.ఇక దాంతో ప్రభాస్ కూడా దాన్ని నేనేం పెద్దగా పట్టించుకోలేదు అని నవ్వాడట, ఇక మొత్తానికైతే ఆ సాంగ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఇక సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పారంట.మొత్తానికైతే ఈ సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికి ప్రభాస్ యాక్టింగ్ కి మాత్రం మంచి గుర్తింపు లభించిందనే చెప్పాలి…