త్వరలో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్( BRS ) సమాయత్తం అవుతోంది.ఈ మేరకు లోక్సభ అభ్యర్థుల ఎంపికపై గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్( CM KCR ) తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్ జిల్లా నేతలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులపై ఈ భేటీలో కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది.
అయితే ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బోయినిపల్లి వినోద్, పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ( Koppula Ishwar ) పేర్లు ఖరారు అయ్యాయని ప్రచారం జోరుగా సాగుతోంది.