Wrinkles : ముడతలను మాయం చేసి ముఖ‌ చర్మాన్ని టైట్ గా మార్చే మ్యాజికల్ రెమెడీ మీకోసం!

పెరిగిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, చెడు వ్యసనాలు, కాస్మెటిక్‌ ఉత్పత్తులు వాడటం తదితర కారణాల వల్ల ఇటీవల కాలంలో చాలా మంది చిన్నవయసులోనే ముడతల( Wrinkles ) సమస్యను ఎదుర్కొంటున్నారు.ముడతల కారణంగా ముఖం అందవిహీనంగా తయారవుతుంది.

 Magical Remedy To Remove Wrinkles And Tighten Facial Skin Is For You-TeluguStop.com

చిన్న వయసులోనే ముసలి వారిలా కనిపిస్తారు.దీంతో అద్దంలో ముఖాన్ని చూసుకోవడానికి కూడా ఇష్టపడరు.

మీరు ఏ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.

ఈ రెమెడీ ముడతలను మాయం చేసి ముఖ చర్మాన్ని సూపర్ టైట్ గా మారుస్తుంది.మీ యవ్వనాన్ని మళ్లీ మీకు తిరిగి అందిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వకనే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ) వేసి మరిగించి స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Symptoms, Tips, Skin, Remedy, Magicalremedy, Skin Care, Skin Care Tips, T

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్( Corn flour ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive oil ) మరియు సరిపడా బ్లాక్ కాఫీ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

Telugu Symptoms, Tips, Skin, Remedy, Magicalremedy, Skin Care, Skin Care Tips, T

కార్న్ ఫ్లోర్, ఆలివ్ ఆయిల్ మరియు కాఫీ లో ఉండే పలు సుగుణాలు చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.ముడతలను క్రమంగా మాయం చేస్తాయి.సాగిన చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి.

రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే మీ చర్మం మళ్లీ యవ్వనంగా కాంతివంతంగా మెరుస్తుంది.ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయాలన్ని దూరం అవుతాయి.

కాబట్టి యవ్వనమైన ప్రకాశవంతమైన చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube