తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోల మధ్య మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది.అయితే ఎవరి మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉన్న లేకపోయిన ప్రభాస్ గోపీచంద్( Prabhas Gopichand )మద్య మాత్రం మంచి ఫ్రెండ్షిప్ ఉందనే విషయం మనందరికీ తెలిసిందే ఎందుకంటే వీళ్ళిద్దరూ తరుచూ కలుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇక దానికి తోడుగా వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచే వీళ్ళకి మంచి పరిచయం ఉండటం ఇక అప్పటినుంచి ఇప్పటివరకు మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు.
ఇక కెరియర్ మొదట్లో ప్రభాస్ సినిమాలో గోపీచంద్ విలన్ గా<( Gopichand Villain Role )/em> నటించి మంచి గుర్తింపు సంపాదించుకోవడం కూడా మనం చూశాం.ఇక ఇదిలా ఉంటే గోపీచంద్ కోసం కథలని విని గోపీచంద్ తో సినిమాలు చేయమని చెప్పిన రోజులు కూడా ఉన్నాయట… నిజానికి తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన శివ( Director Shiva ) తెలుగులో శౌర్యం అనే స్టోరీని గోపిచంద్ తో చేసి సక్సెస్ అందుకున్నాడు.మొదట ఈ సినిమా స్టోరీని శివ ప్రభాస్ కి వినిపించాడట కానీ ప్రభాస్( Prabhas ) అప్పుడు వేరే సినిమా పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా స్టోరీ నాకంటే గోపీచంద్ కైతే బాగుంటుంది.
ఆయనతో ఒకసారి ట్రై చేయండి అని చెప్పాడట దాంతో శివ కూడా గోపీచంద్ కి కథ చెప్పి మెప్పించాడు.
ఇక దాంతో ఈ సినిమా పట్టాలెక్కింది.అలా ప్రభాస్ శౌర్యం సినిమా( Souryam Movie ) చేయాల్సింది కానీ తనే దగ్గరుండి మరి గోపీచంద్ కు ఈ సినిమాను సెట్ చేయించడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.ఇలా ఒక సినిమానే కాదు దాదాపు రెండు మూడు సినిమాల విషయంలో ప్రభాస్ ఇలానే వ్యవహరించి గోపీచంద్ కు మంచి విజయాలను అందించాడనే చెప్పాలి.
ఇక శౌర్యం సినిమా గోపీచంద్ కెరియర్ లోనే భారీ హిట్ గా నిలిచిపోయిందనే చెప్పాలి…
.