ప్రపంచంలో ఎక్కడ లేని సరుకు భారత్ లో దొరుకుతుంది అంటే ఏమో అనుకున్నాం.కానీ ఈ వీడియో చూస్తే మాత్రం అది నిజమే అని చెప్పవచ్చు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతున్న సమయంలో బ్యాడ్మింటన్( Badminton ) రాకెట్ బదులు ఓ చీపురుని వాడటం మనం గమనించవచ్చు.ఈ వీడియోలో మొదటగా ఇద్దరు వ్యక్తులు బ్యాడ్మింటన్ కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతున్న సమయంలో మధ్యలో ఓ వ్యక్తి చీపురు పట్టుకుని రావడం మనం గమనించవచ్చు.
అలా ఇద్దరు వ్యక్తులు ఆడుతున్న మధ్యలో జతన్ అనే వ్యక్తి చీపురును కోర్టు మధ్యలోకి తీసుకుని రావడంతో బ్యాట్మెంటన్ ఆడుతున్న వ్యక్తి చీపురు తీసుకొచ్చిన వ్యక్తిపై అసహనం వ్యక్తం చేయగా.

ఆ వ్యక్తి మాత్రం అతనిని షటిల్ కోర్టు నుంచి వెళ్ళమని చెబుతాడు.అయితే ఆ తర్వాత జతిన్ అనే వ్యక్తి చీపురు( Broom as Badminton Racket )ను బ్యాడ్మింటన్ రాకెట్ గా ఉపయోగిస్తూ బ్యాడ్మింటన్ ఆడడం మొదలుపెడతాడు.బ్యాడ్మింటన్ ఆడడంలో అతని పూర్తి నైపుణ్యాన్ని ప్రదర్శించడం మనకు గమనించవచ్చు.
చీపురుని పట్టుకుని అతి సులువుగా ఆటను ముందుకు కొనసాగిస్తాడు.అంతే కాదండి.
బ్యాడ్మింటన్ రాకెట్ ఆడుతున్న వ్యక్తి కంటే చీపురు పట్టుకున్న వ్యక్తి ఎంతో ఏకాగ్రతతో గేమును పూర్తి చేసి పాయింటును కూడా సాధిస్తాడు.

ఈ పోస్టుకు ఆ వ్యక్తి వీడియోని జోడిస్తూ.” ముగింపు కోసం ఆగండి.పుస్తకం కవర్ పేజీ చూసి ఎవరిని అంచనా వేయొద్దు” అంటూ వీడియోను పోస్ట్ చేశాడు.
ఈ వీడియోను చూసిన నెటిజెన్స్( Netizens ) చీపురుతో గేమ్ ఆడిన జితిన్ ను ఓ “లెజెండ్” అంటూ తెగ పొగడేస్తున్నారు.ఈ వీడియో అతి తక్కువ సమయంలో ఏకంగా మూడు మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఓసారి తిలకించండి.







