టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్( Pan India Hero NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగానే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా అనంతరం వార్ 2 లో కూడా నటించనున్నారు ఎన్టీఆర్.
ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ను కలిశారు.శంషాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించిన తారక్ దేవర( Devara ) షూట్ కోసం ఎక్కడికైనా వెళ్తున్నారా అని అనుకున్నారు అందరూ కానీ ప్రశాంత్ నీల్( Prashant Neel ) ఇంట్లో మార్చి 1న ఏదో శుభకార్యం ఉండగా తన సతీమణితో కలిసి ఆయన అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

వారితో పాటుగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేత యలమంచిలి రవి శంకర్ కూడా ఉన్నారు.ప్రశాంత్ నీల్ ఇంట్లో జరుగుతున్న ఒక కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతి( Lakshmi Pranathi )తో పాటుగా వెళ్లారు.అదే కార్యక్రమానికి కాంతార హీరో రిషబ్ శెట్టి( Rishabh Shetty ) సైతం తన సతీమణి ప్రగతితో కలిసి పాల్గొన్నారు.అక్కడ వారందరూ కలిసి దిగిన గ్రూప్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
తారక్‌తో రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం కనిపిస్తుంది.కాగా ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.కాంతారా కేజీఎఫ్ సిరీస్‌లను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది.అలా ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.ఇప్పుడు ఈ ముగ్గురిని ఒకే ఫ్రేమ్‌లో చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు.ఫోటోపై అభిమానులు భారీగా లైకులతో క్లిక్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో రిషబ్ శెట్టి కూడా నటించనున్నారా అనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.
ఆ ఫోటోలో ఎన్టీఆర్ స్లిమ్ లుక్ లో కనిపించి అదుర్స్ అనిపిస్తున్నారు.