రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ పరీక్షలు( Inter exams ) జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇంటర్ లో మంచి మార్కులు సాధిస్తే భవిష్యత్తు బాగుంటుందని చాలామంది విద్యార్థులు బలంగా నమ్ముతారు.
అయితే ఒక నిమిషం నిబంధన వల్ల ఎంతోమంది విద్యార్థుల( students ) జీవితాలు తారుమారవుతున్నాయి.పరీక్ష కేంద్రాల విషయంలో గందరగోళం, తాము నివశించే ప్రదేశానికి పరీక్ష కేంద్రాలు దూరంగా ఉండటం, ట్రాఫిక్ ఇతర కారణాల వల్ల కొంతమంది విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం లేదు.
అయితే ఇంటర్ పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధనలను ఎత్తేస్తే మేలని కామెంట్లు వినిపిస్తున్నాయి.పరీక్షకు హాజరు కాలేకపోవడం వల్ల ఆ విద్యార్థి భవిష్యత్తు పరీక్షలపై సైతం ఆ ప్రభావం పడుతుంది.
ఒక నిమిషం నిబంధన ( A minute rule ) విద్యార్థుల కెరీర్ ను గందరగోళంలోకి నెడుతోంది.పరీక్ష రాయలేదని మనస్తాపం చెంది కొంతమంది విద్యార్థులు తీవ్రస్థాయిలో మనస్తాపం చెందుతుండటం గమనార్హం.
విద్యార్థి సంఘాలు( Student Unions ) సైతం ఈ నిబంధనను తొలగించాలని చెబుతున్నారు.ఎంసెట్, ఐఐటీ, ప్రభుత్వ ( MSET, IIT ) పోటీ పరీక్షలలో ఇలాంటి రూల్స్ ను అమలు చేయడంలో తప్పు లేదని ఇంటర్ పరీక్షలకు ఇలాంటి రూల్స్ వల్ల వందల సంఖ్యలో విద్యార్థుల కెరీర్ ప్రమాదంలో పడుతోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.విద్యార్థులు సైతం పరీక్ష కేంద్రాలకు కనీసం 40 నిమిషాల ముందు చేరుకుంటే మంచిది.
విద్యార్థులు పరీక్షల సమయంలో ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి.ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ఈ నిబంధన మారే అవకాశాలు అయితే ఉంటాయి.ఒక నిమిషం నిబంధన విషయంలో విద్యార్థులు మాత్రం తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి రూల్స్ వల్ల పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్ కాలేకపోతున్నామని కొంతమంది స్టూడెంట్స్ కామెంట్లు చేస్తున్నారు.