మానవ హక్కులపై అవగాహన కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం( Mustabad ) తెర్లుమద్ది గ్రామంలోని అంబేద్కర్ భవనంలో పౌర హక్కులపై ప్రభుత్వ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.గ్రామస్తులు అంతంత మాత్రమే హాజరయ్యారు.

 Human Rights Awareness Programme-TeluguStop.com

సంబంధిత అధికారులు కూడా కొందరు హాజరు కాలేదు.ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి భాస్కర్ శర్మ( Bhaskar Sharma ) మాట్లాడుతూకులవివక్ష, అంటరానితనం,ఈర్ష్య,ద్వేషం ఉండరాదని సమానత్వం సోదరభావం పరస్పర సహకారం ఉండాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చదువుతోనే విజ్ఞానం,వికాసం సమాజంలో విలువ గౌరవం వస్తుందన్నారు.వ్యక్తిగత పరిశుభ్రత మంచి ప్రవర్తన అలవర్చుకోవాలని సూచించారు.సోషల్ వెల్ఫేర్ అధికారి కరుణాకర్ మానవ హక్కుల దినోత్సవ ( Human Rights Day )ప్రతిజ్ఞ చేయించారు.సమతా మమతలతో స్వేచ్ఛ సమానత్వంతో సమాజం పట్ల బాధ్యతగా మెలుగుతామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి వంశీకృష్ణ,ఆర్ ఐ రఘు మాజీ సర్పంచులు కృష్ణ, కిషన్ రావు,గ్రామస్తులు నవీన్,బాలపోచయ్య, సాగర్,పర్షరాములు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube