మానవ హక్కులపై అవగాహన కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం( Mustabad ) తెర్లుమద్ది గ్రామంలోని అంబేద్కర్ భవనంలో పౌర హక్కులపై ప్రభుత్వ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

గ్రామస్తులు అంతంత మాత్రమే హాజరయ్యారు.సంబంధిత అధికారులు కూడా కొందరు హాజరు కాలేదు.

ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి భాస్కర్ శర్మ( Bhaskar Sharma ) మాట్లాడుతూకులవివక్ష, అంటరానితనం,ఈర్ష్య,ద్వేషం ఉండరాదని సమానత్వం సోదరభావం పరస్పర సహకారం ఉండాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చదువుతోనే విజ్ఞానం,వికాసం సమాజంలో విలువ గౌరవం వస్తుందన్నారు.వ్యక్తిగత పరిశుభ్రత మంచి ప్రవర్తన అలవర్చుకోవాలని సూచించారు.

సోషల్ వెల్ఫేర్ అధికారి కరుణాకర్ మానవ హక్కుల దినోత్సవ ( Human Rights Day )ప్రతిజ్ఞ చేయించారు.

సమతా మమతలతో స్వేచ్ఛ సమానత్వంతో సమాజం పట్ల బాధ్యతగా మెలుగుతామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి వంశీకృష్ణ,ఆర్ ఐ రఘు మాజీ సర్పంచులు కృష్ణ, కిషన్ రావు,గ్రామస్తులు నవీన్,బాలపోచయ్య, సాగర్,పర్షరాములు తదితరులు పాల్గొన్నారు.

భారత సంతతి నిర్మాతకు వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో అరుదైన గౌరవం