కంగనా ( Kangana ) అంటే కాంట్రవర్సీ… కాంట్రవర్సీ అంటే కంగనా.ఇలాగే ఆమె గురించి ఎవరిని అడిగినా చెబుతారు.36 ఏళ్ళు ఈ కాంట్రవర్షియల్ క్వీన్ హిమాచల్ ప్రదేశ్ ( Himachal Pradesh )లో పుట్టింది.2006 నుంచి సినిమా ఇండస్ట్రీలో పని చేస్తుంది.అనేక సినిమాల్లో నటించింది.సినిమాల్లోకి రావడానికి ఆమె చాలా కష్టాలు అనుభవించింది.దాని గురించి చాలా సార్లు ఓపెన్ గా మాట్లాడింది.ఆమె మాట్లాడితే ప్రస్తుతం ఉన్న బాలీవుడ్ ( Bollywood )ఇండస్ట్రీకి నచ్చదు.
కానీ ఆమె చెప్పే ప్రతి విషయము నిజమే అని ఒప్పుకోవాల్సిందే.బాలీవుడ్ లో నెపోటిజం మీద ప్రశ్నించే ఏకైక వ్యక్తి కంగనా రనౌత్.
అందుకే ఆమె నోరు నొక్కడానికి అందరు ట్రై చేస్తూ ఉంటారు.

ఎవరు ఎంత చేసినా ఆమెను ఏమి చేయలేరు అనేది జగమెరిగిన సత్యం.ఇక ఆమె ఇండస్ట్రీలో ఎంత వరకు చేయాలో అంతా బాగానే చేసింది.అయితే ప్రస్తుతం రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుందట.
బిజెపి( BJP ) పార్టీతో చాలా రోజులుగా సన్నిహితంగా ఉంటూ వస్తోంది ఈ అమ్మడు.తాజాగా ఆమెకు పద్మ పురాష్కారం కూడా దక్కింది.సరే ఇవన్నీ కాసేపు పక్కన పెడితే బాక్సాఫీస్ వద్ద చాలా ఏళ్లుగా విజయాలకు నోచుకోని ఈ అమ్మడు రెమ్యునరేషన్ ( Remuneration )విషయంలో మాత్రం ఒక అడుగు కూడా తగ్గడం లేదు.9 ఏళ్లుగా దాదాపు ఒక్కటంటే ఒక విజయం కూడా సాధించలేదు కంగనా రనౌత్.కానీ ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ గా ఉంది.

ఆమె చివరిగా నటించడం మూడు సినిమాల విషయానికొస్తే తేజాస్ కూడా కలెక్షన్స్ పరంగా ఆశాజనకంగా లేదు.తేజాస్ నాలుగు కోట్ల వసూలు చేయగా, దాకడ్ రెండున్నర కోట్లు వసూలు చేసింది.ఇక తలైవి కేవలం రెండు కోట్ల కలెక్షన్స్ కూడా దక్కించుకోలేదు.
ఇలా ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ కూడా దక్కించుకొలేని సినిమాలలో ఆమె నటిస్తూ వస్తోంది.అయితే ఇంత తక్కువ గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తున్న కంగనా రనౌత్ ఎంత పారితోషకం తీసుకుంటుందో తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండరు.
ఆమె ప్రస్తుతం ఒక్కో సినిమాకి 27 కోట్ల రూపాయల పారితోషకం అందుకుంటుంది.వరుసగా తొమ్మిదేళ్లుగా ఒక విజయం సాధించకుండా ఇంత హైయెస్ట్ రెమ్యూనిరేషన్ తీసుకున్న ఏకైక నటి కంగనా మాత్రమే.







