తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చాలామంది హీరోలలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ( Chiranjeevi, Nagarjuna, Balakrishna ) ముగ్గురు ప్రముఖ స్థానంలో ఉంటారు.ఇక ఒకప్పుడు వీళ్ళ సినిమాలను చూడడానికి జనాలు ఎగబడే వారు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇలాంటి సందర్భంలో వీళ్లు ప్రస్తుతం స్టార్ హీరోలుగా మంచి గుర్తింపుని సంపాదించుకోవడమే కాకుండా ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు.

ఇక ఈ ఏజ్ లో కూడా వాళ్ళు యంగ్ హీరోలకు సైతం పోటీ ని ఇస్తూ మంచి సినిమాలు చేస్తూ వాళ్ళ మార్కెట్ ను పదిలంగా కాపాడుకుంటున్నారు.ఇక ఇదిలా ఉంటే సీనియర్ హీరో అయిన నాగేశ్వరరావు( Nageswara Rao ) వీళ్ళ ముగ్గురి సినిమాల్లో నటించి వీళ్ళ ముగ్గురికి ఫ్లాప్ లను ఇచ్చాడు.ఇక వీళ్లతో పాటు గా నటించిన సినిమాలు ఏవి కూడా ఆడకపోవడం విశేషం… ఇక నాగేశ్వరరావు చిరంజీవితో మెకానిక్ అల్లుడు( Mechanic Alludu ) అనే సినిమాలో చిరంజీవికి మామ పాత్ర లో నటించాడు.
ఇక ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది.అలాగే నాగర్జున తో ఇద్దరు ఇద్దరే ( iddaru iddare )సినిమాలో నటించాడు.

ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది.ఇక బాలయ్య బాబు హీరోగా మలయాళ దర్శకుడు అయిన ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన గాండీవం( Gandivam ) సినిమాలో నాగేశ్వరరావు బాలయ్య బాబు ఫాదర్ గా నటించాడు.ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది.ఇలా ముగ్గురు హీరోలతో నటించడం ఆ మూడు సినిమాలు ప్లాప్ అవ్వడంతో నాగేశ్వర రావు ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తీసుకుంటే సినిమాలు ప్లాప్ అవుతాయని తెలుగు సినిమా దర్శకులతో పాటు ప్రేక్షకులకు కూడా ఒక స్థాయి నమ్మకం అయితే వచ్చేసింది…
.







