ఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహం( Diabetes ) సమస్యతో బాధపడుతున్నారు.అతి తక్కువ వయసు లోనే మధుమేహం వ్యాధి చాలా మందిని ఇబ్బంది పెడుతుంది.
వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు.జీవనశైలి, సరైన ఆహారం ద్వారా మాత్రమే దీన్ని నియంత్రించవచ్చు.
ఈ వ్యాధుల బాధితుల రక్తంలో చక్కెర స్థాయి అనియంత్రితంగ పెరగడం ప్రారంభమవుతుంది.కాబట్టి మధుమేహం నియంత్రించడం చాలా ముఖ్యం.
రక్తంలో చక్కెరను( Blood Sugar Level ) నియంత్రించడానికి కొన్ని ఇంటి నివారణల సహాయం తీసుకోవచ్చు.ఈ రెమెడీస్ లో పలావ్ ఆకు కూడా అద్భుతం చేస్తుంది.
మధుమేహన్ని నియంత్రించడంలో ఈ ఆకు ముఖ్యపాత్ర పోషిస్తుంది.రక్తంలో చక్కెరను నియంత్రించడంలో పలవ్ ఆకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పలావ్ ఆకును( Bay Leaves ) వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.అయితే ఇది రుచిని పెంచడం కోసం ఉపయోగిస్తారు.ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.పలావ్ ఆకులను తీసుకోవడం వలన మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు.అంతేకాకుండా ఇన్సులిన్ లెవెల్స్ ని ( Insulin Levels ) కూడా బ్యాలెన్స్ చేస్తాయి.దీన్ని రెగ్యులర్ వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
మధుమేహం అదుపులో ఉండాలంటే పలావు ఆకుల రసాన్ని సేవించవచ్చు.

దీనికోసం ఒక పాన్ లో ఒక గ్లాసు నీటిని వేడి చేసి అందులో రెండు నుండి మూడు పలావ్ ఆకులను వేసి ఐదు నిమిషాలు మరిగించాలి.ఆ తర్వాత వడపోసి గోరువెచ్చగా తాగాలి.ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
అలాగే ఈ ఆకు వినియోగంతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి శ్వాస కోసం సంబంధిత సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటి వ్ లక్షణాలు వాపులు, నొప్పులను తగ్గిస్తాయి.
అలాగే కీళ్లనొప్పి, ఆర్థరైటిస్ లాంటి వాటిని కూడా తగ్గిస్తాయి.







