Sandeep Vanga Prabhas Spirit : ప్రభాస్ స్పిరిట్ మూవీ స్టోరీ లైన్ రివీల్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. హారర్ సినిమా కాదంటూ?

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా ఇటీవలే విడుదల అయి మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

 Sandeep Reddy Vanga Gives Clarity About Prabhas Spirit-TeluguStop.com

అందులో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే సందీప్ రెడ్డి త్వరలోనే ప్రభాస్ తో( Prabhas ) స్పిరిట్( Spirit Movie ) అనే సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు.తాజాగా సందీప్ వంగా దీని గురించి మాట్లాడారు.

ఒక బాలీవుడ్‌ సినిమా టీజర్‌ లాంఛ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన స్పిరిట్‌ మూవీపై స్పందించారు.

Telugu Animal Park, Prabhas, Prabhas Role, Prabhas Spirit, Sandeepreddy, Sandeep

ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.ప్రస్తుతం నేను ప్రభాస్‌తో చేయనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను.అందరూ అనుకుంటున్నట్లు ఇది హారర్‌ స్టోరీ కాదు.

ఒక నిజాయితీ కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌ కథ.( Police Officer Story ) ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.అనంతరం యానిమల్‌ పార్క్‌ ( Animal Park ) సినిమాను రూపొందిస్తాను.ప్రస్తుతానికి ఈ అప్‌డేట్‌ మాత్రమే ఇవ్వగలను అని చెప్పారు.పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబు కానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు.గతంలో నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.

Telugu Animal Park, Prabhas, Prabhas Role, Prabhas Spirit, Sandeepreddy, Sandeep

ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.దాంతో ఈ చిత్రం పై అంచనాలు రెట్టింపయ్యాయి.ఈ పోలీస్‌ డ్రామాకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు.ఎనిమిది భాషల్లో ఈ చిత్రం రానుంది.ప్రస్తుతం ప్రభాస్‌ రాజా సాబ్‌( Raja Saab Movie ) చిత్రంతో బిజీగా ఉన్నారు.మారుతి దర్శకత్వంలో రొమాంటిక్‌ హారర్‌ చిత్రంగా ఇది రూపొందుతోంది.

ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయింది.ఇందులో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌ కథానాయికలుగా నటిస్తున్నట్లు సమాచారం.

దీనితో పాటు కల్కి 2898 ఏడీలో( Kalki 2898 AD ) ప్రభాస్‌ నటిస్తున్నారు.సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube