జలుబు( Cold ) అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో జలుబును ఫేస్ చేసే ఉంటారు.
జలుబు వల్ల అసౌకర్యానికి గురవుతుంటారు.పని పై దృష్టి పెట్టలేకపోతుంటారు.
పైగా జలుబు చేసినప్పుడు ఊపిరాడడం కూడా ఎంతో కష్టంగా ఉంటుంది.ఈ క్రమంలోనే జలుబు తగ్గడం కోసం ఎన్నో మందులు వాడుతున్నారు.
కానీ సహజంగా కూడా జలుబును నివారించుకోవచ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను తీసుకుంటే కనుక జలుబు ఎంత తీవ్రంగా ఉన్నా సరే రెండు రోజుల్లో ఎగిరిపోతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం జలుబును తరిమికొట్టే ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మూడు మిరియాలు, వన్ టేబుల్ స్పూన్ ధనియాలు మరియు అర అంగుళం దాల్చిన చెక్క( Cinnamon )ను తీసుకుని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో దంచి పెట్టుకున్న పదార్థాలను వేసుకోవాలి.ఆరు నిమిషాల పాటు మరిగిన తర్వాత అందులో ఐదు ఫ్రెష్ తులసి ఆకులు( Basil leaves ) వేసుకోవాలి.
మరో ఆరు నిమిషాల పాటు మరిగించి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
గోరువెచ్చగా అయిన తర్వాత ఈ వాటర్ ను నేరుగా సేవించాలి.తులసి, మిరియాలు, దాల్చిన చెక్క మరియు ధనియాల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.అలాగే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి.
ఇవి బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ లకు వ్యతిరేకంగా పోరాడుతాయి.జలుబు సమస్యను సమర్థవంతంగా నివారిస్తాయి.
రోజుకు ఒకసారి ఇప్పుడు చెప్పుకున్న డ్రింక్ ను కనుక తీసుకుంటే జలుబు ఎంత తీవ్రంగా ఉన్నాసరే చాలా త్వరగా నయమవుతుంది.అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల దగ్గు సమస్య ఉంటే తగ్గుముఖం పడుతుంది.
ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.మైండ్ పీస్ ఫుల్ గా మారుతుంది.
నోటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.ఈ డ్రింక్ తో బ్యాడ్ బ్రీత్ సమస్యకు సైతం చెక్ పెట్టవచ్చు.