తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు వరుస విజయాలను అందుకున్న చాలా మంది దర్శకులు ప్రస్తుతం పాన్ ఇండియా దర్శకులుగా మారిపోతున్నారు.రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్లు తమ కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఇప్పుడు కొంతమంది స్టార్ డైరెక్టర్లు కూడా వాళ్ల బాటలో నడవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇక అందులో ముఖ్యంగా కొరటాల శివ( Koratala Shiva ) దేవర సినిమాతో సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇప్పటికే సాహో సినిమాతో పాన్ ఇండియా సినిమా చేసిన సుజీత్( Sujeeth ) మరోసారి ఓజీ సినిమాతో తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక కల్కి సినిమాతో నాగ్ అశ్విన్( Nag Ashwin ) కూడా పాన్ ఇండియా లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు.గౌతమ్ తిన్ననూరి( Gautam Tinnanuri ) కూడా విజయ్ దేవరకొండ తో చేసే సినిమాతో మరోసారి ఇండియా లెవెల్లో సత్తా చాటాలనుకుంటున్నాడు.ఇక ఇప్పటికే ఆయన చేసిన జెర్సీ సినిమాని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేసినప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు.దాంతో ఇప్పుడు చేయబోయే సినిమాతో ఎలాగైనా తన సత్తా చాటుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఆయన చేసిన మళ్లీ రావా, జెర్సీ సినిమాలు తెలుగులో మంచి విజయాలను అందుకున్నాయి.కాబట్టి పాన్ ఇండియాలో తన సత్తా చాటి రాజమౌళి, సుకుమార్ సందీప్ రెడ్డి వంగ లా మాదిరిగానే తను కూడా పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు.ఇక ఈ దర్శకులు కనక పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధిస్తే తెలుగు నుంచి చాలామంది దర్శకులు పాన్ ఇండియాలో తన చాటుకున్న వాళ్ళుగా నిలుస్తారు.








