ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ( Congress party ) చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు.
వచ్చే నెలలో ఏపీ అభివృద్ధికి సంబంధించి తిరుపతిలో భారీ బహిరంగ సభలో ప్రత్యేక హోదా డిక్లరేషన్ ప్రకటించబోతుంది.ప్రత్యేక హోదా ఒక రాజకీయ అంశంగా వాడుకుని రాజకీయ పార్టీలు వ్యవహరించాయి.
అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా అంశాన్ని గాలికి వదిలేసాయి.ఆనాడు ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా అని ప్రకటిస్తే లేదు లేదు ఏపీకి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కేటాయిస్తామని బీజేపీ( BJP ) మాట ఇచ్చింది.
అయితే ఎక్కడైతే మోదీ మాట ఇచ్చి తప్పారో అదే స్థలంలో మార్చి 1వ తారీకు కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో సభ నిర్వహిస్తోంది.
ఈ సభలో ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి జరిగే మేలులు గురించి తెలియజేస్తాం.ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకుంటూ డిక్లరేషన్ విడుదల చేయడం జరుగుద్ది.రాష్ట్రంలో 900 కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం ఉన్న ఒక పరిశ్రమలు రాలేదు.
మెగా డీఎస్సీ అని చెప్పి దగ డీఎస్సీ విడుదల చేసి జగన్ ప్రభుత్వం యువతను మోసం చేసింది అని షర్మిల సీరియస్ కామెంట్స్ చేశారు.మోదీకి ,జగన్, చంద్రబాబు( Modi, Jagan, Chandrababu ) బానిసలుగా మారారని దుయ్యబట్టారు.
ఈ పది ఏళ్లలో ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేసిన వారే లేరని.వీరిని ఎందుకు నమ్మాలి.? ఎలా నమ్మాలి.? అని ప్రశ్నించారు.మార్చి మొదటి తారీకు తిరుపతిలో జరగబోయే సభలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటిస్తుందని వైయస్ షర్మిల తెలిపారు.