నల్లగొండ జిల్లా:త్రిపురారం మండల కేంద్రంలో లిటిల్ ఫ్లవర్,ఆల్ఫా పాఠశాల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సైన్స్ ఎక్స్పో వేడుకలు ఘనంగా నిర్వహించారు.పాఠశాలల విద్యార్దులు చిన్ని మేధస్సును ఉపయోగించి చిట్టి చేతులతో చేసిన పెద్ద ప్రయోగాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి త్రిపురారం ఎస్ఐ వీరశేఖర్ ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ ఈ సైన్స్ ఎక్స్పో వల్ల విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు.ఈ సైన్స్ ఎక్స్పో వల్ల విద్యార్థులకు విజ్ఞానశాస్త్ర రంగంలో సాంకేతిక ప్రగతికి ఎంతో ఉపకరిస్తుందని, సైన్స్ జీవితంలో ఒక భాగం కావాలని సూచించారు.
అనంతరం విద్యార్థులు తాము రూపొందించిన ప్రయోగాలు ప్రదర్శించి వాటి గురించి చక్కగా వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దామోదర్,సలీం ఉపాధ్యాయులు,విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.