Prashanth Neel : ప్రశాంత్ నీల్ ఆల్ టైం ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా కొనసాగుతూ ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి వారిలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ఒకరు.కన్నడ చిత్రపరిశ్రమలో పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఉన్నటువంటి ఈయన కే జి ఎఫ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Prashanth Neel : ప్రశాంత్ నీల్ ఆల్ టైం ఫ-TeluguStop.com

ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు మంచి ఆదరణ రావడంతో ఈయన క్రేజ్ కూడా పెరిగిపోయింది.

ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో ప్రశాంత్ చేసిన సలార్( Salaar ) సినిమా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.

Telugu Salaar, Prashanth Neel, Upendra, Sri Devi, Prabhas, Prashanthneel-Movie

ప్రభాస్( Prabhas ) హీరోగా చేసినటువంటి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది.త్వరలోనే ఈ సినిమా రెండో భాగం షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.ఇలా ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఎంతో గుర్తింపు పొందినటువంటి ప్రశాంత్ ఇటీవల ఓ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తనకు ఇష్టమైనటువంటి హీరో హీరోయిన్ గురించి అలాగే డైరెక్టర్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Salaar, Prashanth Neel, Upendra, Sri Devi, Prabhas, Prashanthneel-Movie

సినిమాల పరంగా ఎంతో నైపుణ్యం కలిగినటువంటి ఈ డైరెక్టర్ కు ఏ డైరెక్టర్ అంటే ఇష్టం అనే విషయం గురించి ఆసక్తి నెలకొంది.ప్రశాంత్ నీల్ కి ఉపేంద్ర( Upendra ) ఆల్ టైం ఫేవరేట్ దర్శకుడు అట.అందుకు కారణం ఉందట.ఉపేంద్ర తెరకెక్కించిన ఉష్, A , ఓం, ఉపేంద్ర… చిత్రాలు చాలా ప్రత్యేకం.ఆయన సెటైరికల్ స్టోరీ టెల్లింగ్ ఎవరికీ సాధ్యం కాదని ప్రశాంత్ నీల్ అన్నారు.

 అందుకే తనకి ఎప్పటికీ ఉపేంద్ర అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా ప్రశాంత్ తెలిపారు.ఇక నటుడు అమితాబ్( Amitabh ) నటి శ్రీదేవి( Sri Devi ) అంటే తనకు ఇష్టమని ఈయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube