ప్రతి మనిషికి జీవితంలో సక్సెస్ ఇచ్చే సంతోషం అంతాఇంతా కాదు.ఒక్కసారి కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తే లైఫ్ సెటిల్ అయినట్టే అని చాలామంది భావిస్తారు.
మంచి వేతనంతో కూడిన ఉద్యోగం వస్తే ఎన్ని కష్టాలనైనా సులువుగా అధిగమించవచ్చని బలంగా నమ్ముతారు.అలా ఎంతో కష్టపడి, కష్టాలను అధిగమించి రెండుసార్లు ఫెయిలైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా లక్ష్యాన్ని సాధించి విజయ్ కుమార్( Vijay Kumar ) వార్తల్లో నిలిచారు.
సివిల్ జడ్జి ( Civil Judge ) పరీక్షలో మూడో ప్రయత్నంలో సక్సెస్ అయిన విజయ్ కుమార్ విజయనగరం జిల్లాలోని( Vizianagaram District ) అనేకల్ తండేల్ చెందినవారు.పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను అభ్యసించిన విజయ్ కుమార్ గంగావతి భీమప్ప కాలేజ్ లో పీయూసీ, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
బళ్లారిలో ఉన్న వీ.ఎస్.ఆర్ లా కాలేజ్ లో ఎల్.ఎల్.బీ పాసైన విజయ్ కుమార్ కెరీర్ పరంగా సక్సెస్ కావడానికి ఎంతో కష్టపడ్డారు.
విజయ్ కుమార్ నివశించే తండాలా కేవలం 1200 ఇళ్లు ఉన్నాయి.ఆ తండాలో ఇప్పటివరకు నలుగురు న్యాయవాదులు ఉన్నారు.విజయ్ కుమార్ జడ్జిగా ఎంపిక కావడం తాండా వాసులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
విజయ్ కుమార్ సక్సెస్ స్టోరీ( Vijay Kumar Success Story ) నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.విజయ్ కుమార్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
విజయ్ కుమార్ బాల్యం నుంచి చదువులో చురుకుగా ఉండేవాడని తల్లీదండ్రుల నుంచి కూడా ప్రోత్సాహం లభించడం అతనికి ప్లస్ అయిందని తెలుస్తొంది.విజయ్ కుమార్ సక్సెస్ స్టోరీ ఎంతోమంది తాండా వాసులలో స్పూర్తిని నింపుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.విజయ్ కుమార్ సక్సెస్ కు హ్యాట్సాఫ్ ఆనాల్సిందేనంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సరైన ప్రిపరేషన్ తో ప్రణాళికబద్ధంగా కష్టపడితే సక్సెస్ సొంతమవుతుందని ఆయన ప్రూవ్ చేశారు.