మహాలక్ష్మీ పథకం( Mahalakshmi Scheme )పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పథకంలో భాగంగా రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్ మహాలక్ష్మీ పథకానికి సంబంధించిన జీవోను జారీ చేసింది.
సబ్సిడీ గ్యాస్ సిలిండర్( Subsidized gas cylinder ) కోసం మూడు ప్రమాణాలను సిద్ధం చేసింది.ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో తెల్లరేషన్ కార్డు( Ration card ) ఆధారంగా అర్హులను గుర్తించింది.ఈ మేరకు మొత్తం 39.5 లక్షల మంది లబ్దిదారులను ప్రభుత్వం గుర్తించింది.సిలిండర్ తీసుకున్న తరువాత సబ్సిడీ మొత్తం వినియోగదారుల ఖాతాల్లోకి నగదును నేరుగా జమ చేయనుంది ప్రభుత్వం.రూ.500 కే గ్యాస్ సిలిండర్లతో పాటు గృహాజ్యోతి పథకంలోని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది.