భారతీయ వివాహాలు సంగీతం, డ్యాన్స్ తదితర వేడుకలతో చాలా ఘనంగా జరుగుతాయి.పెళ్లిళ్లు ( Marriages ) స్వర్గంలో జరుగుతాయని పెద్దలు అంటుంటారు.
నిజంగానే ఒక స్వర్గం లాంటి వాతావరణం పెళ్లి వేడుకలలో తలపిస్తుంటుంది.పెళ్లిలో అనేక ఆచార, సాంప్రదాయాలు ఉన్నాయి.
వాటిలో సప్తపది వేడుక ఒకటి.వధువు, వరుడు పవిత్రమైన అగ్ని చుట్టూ ఏడడుగులు నడిచే కీలకమైన ఆచారం ఇది, ప్రతి అడుగు వారు ఒకరికొకరు ప్రతి అడుగులో తోడవుతామని చెప్పకనే చెబుతుంది.
సాంప్రదాయకంగా, ఈ వేడుకలో పూజారి పవిత్రమైన మంత్రాలు లేదా శ్లోకాలు పఠిస్తారు.
అయితే ఒక పెళ్లి వేడుకలో మాత్రం పూజారి( Priest ) మంత్రాలకు బదులు పాటలు పాడారు.ఫిబ్రవరి 25న ఈ విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక వివాహ పూజారి సప్తపది వేడుక సమయంలో, సాధారణ మంత్రాలకు బదులుగా, ప్రముఖ బాలీవుడ్ లవ్ సాంగ్స్( Bollywood Love Songs ) పాడారు.
అతను “తుఝే దేఖా తో యే జానా సనమ్”, “హోగయా హై తుజ్కో తో ప్యార్ సజ్నా” వంటి మెలోడీ సాంగ్స్ పాడుతూ వధూవరులకు షాక్ ఇచ్చారు.పూజారి నోట ఆ పాటలు అతిథులు ఆశ్చర్యపోయారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.దీనికి కొంత సమయంలోనే వేళల్లో వ్యూస్ వచ్చాయి.ఈ పూజారి వాయిస్ బాగుందని, పాటలు కూడా అద్భుతంగా పాడుతున్నారని కొందరు కామెంట్ చేశారు.ఈ వీడియో చూడగానే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నానని ఒక యూజర్ కామెంట్ చేశాడు.
కొంతమంది మాత్రం ఈ వీడియో చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.పూజారి పవిత్రమైన సంప్రదాయాన్ని అగౌరవపరుస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
పవిత్ర గ్రంథాలను, ఆచార వ్యవహారాలను ఆయన చిన్నచూపు చూస్తున్నారని వాపోయారు.“అతను గ్రంధాలను, మంత్రాలను అపహాస్యం చేసారు.
” అని ఒకరు వ్యాఖ్యానించారు.ఏది ఏమైనా ఈ పూజారి మ్యూజిక్ ఫీల్డ్ లోకి రాకుండా మంత్రాలు చదివే పండితుడు కావడం ఆశ్చర్యకరం.