సినిమాల్లో సక్సెస్ సాధించడం చాలా కష్టం కానీ ఒక్కసారి విజయం సాధిస్తే జనాల్లో ఆదరణతో పాటు చాలా డబ్బు వచ్చి పడుతుంది.మూవీ కెరీర్ మంచి సంతృప్తిని కూడా అందిస్తుంది.
అయితే ఒకరికి ఇంత మంచి చేసే సినిమా ఇండస్ట్రీ అప్పుడప్పుడు చెడు కూడా చేస్తుంది.ఒకేసారి ఆకాశానికి ఎత్తేసి చివరికి పాతాళంలోకి తోసేసే కఠిన ఫీల్డ్ ఇది.ఇక కొంతమందికి సినిమాల్లో బాగా సక్సెస్ సాధించి ఉజ్వల భవిష్యత్తు ఉన్నా విధి వారి పట్ల చిన్నచూపు చూస్తుంది.మంచి గుర్తింపు వస్తున్న సమయంలోనే వారి జీవితాలలో విషాదాన్ని నింపుతుంటుంది.
అలాంటి పరిస్థితిని స్టార్ యాక్ట్రెస్ దివ్యభారతి( Divya Bharti ) అనుభవించింది.
ఈ ముద్దుగుమ్మ అందం, అభినయం, మంచి నటన, అదిరిపోయే డ్యాన్స్ స్కిల్స్‌తో 19 ఏళ్లకే హీరోయిన్ స్టార్ స్టేటస్ దక్కించుకుంది.
అంతా సంతోషంగా ఉన్న సమయంలోనే ఆమె 20 ఏళ్లు నిండకుండానే మృతి చెందింది.ఈ వార్త అప్పట్లో సినిమా ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
దివ్యభారతి బి గోపాల్, వెంకటేష్ కాంబోలో వచ్చిన ‘బొబ్బిలి రాజా (1990)’( Bobbili Raja Movie ) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యింది.ఈ మూవీ మంచి హిట్ అయింది.
ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన దివ్య భారతి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.
వెంకటేష్ తో( Venkatesh ) నటించి మంచి హిట్ కొట్టాక ఆమె చాలామంది దర్శకుల దృష్టిలో పడింది.దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా ఆమె టాలెంట్ కు ముగ్ధుడయ్యాడు.అందుకే దివ్యభారతిని తన “రౌడీ అల్లుడు”( Rowdy Alludu Movie ) సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నాడు.
ఇందులో చిరంజీవి( Chiranjeevi ) హీరోగా నటించాడు.అయితే ఈ మూవీలోని పాటలలో చిరంజీవికి పోటీగా ఆమె టెర్రిఫిక్ డాన్స్ స్టెప్పులు వేసింది.
నిజానికి ఈ సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో దివ్య భారతికి 104 డిగ్రీల జ్వరం వచ్చింది అయినా ఆమె ఆ విషయాన్ని దాచిపెట్టి అలాగే షూటింగ్‌లో పాల్గొన్నది.ఈ విషయం చివరికి తెలిసి చిరంజీవి షాక్ అయ్యాడట.
షూటింగ్ ఒక్క రోజు ఆలస్యమైనా పోయేదేమీ లేదు ఆమె ఆరోగ్యం మనకు ముఖ్యమని చెప్పాడట.
అయినా దివ్యభారతి ఆపాల్సిన అవసరం లేదని చెబుతూ తన బాడీలో మొత్తం ఎనర్జీని తెచ్చుకుందట.ఆ తీవ్రమైన జ్వరంతోనే ఆమె చిరంజీవితో పోటాపోటీగా డాన్స్ చేసి వావ్ అనిపించింది.జ్వరంతో ఆమె స్టెప్పులు వేసిన పాట ఏంటంటే, “తద్దినికా తప్పదికా”.
ఈ పాట చూస్తే ఆమె ఎంత మంచి డాన్సరో ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే.ఫీవర్‌లో కూడా ఆమె గ్రేస్ తో వేసిన స్టెప్పులు చూస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు.చిరంజీవి కూడా ఆమె డెడికేషన్ కి ఆశ్చర్యపోతూ చప్పట్లు కొట్టాడట.“చాలా పెద్ద హీరోయిన్ వి అయిపోతావ్ నీ డెడికేషన్ కి నా హాట్సాఫ్” అంటూ చెప్పాడట.ఆ సమయానికి ఆమె వయసు కేవలం 18 ఏళ్ళే! అంత మంచి భవిష్యత్తు ఉన్న ఆ యువ హీరోయిన్ 20 ఏళ్ల లోపే చనిపోవడం నిజంగా బాధాకరం.