Varun Tej: హీరో వరుణ్ తేజ్ కి అవి అంటే అంత భయమా.. ఇబ్బంది పడుతూనే ఉన్నారా?

మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా మెగా హీరోగా గుర్తింపు పొందినటువంటి వారిలో నటుడు వరుణ్ తేజ్ ( Varun Tej ) ఒకరు.

 Varun Tej Has A Fear Of Tattoo Full Details Inside-TeluguStop.com

ఈయన నాగబాబు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ లో ముందుకు వెళుతున్నటువంటి ఈయన త్వరలోనే ఆపరేషన్ వాలంటైన్( Operation Valentine) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమా మార్చి 1వ తేదీ విడుదల కాబోతోంది.

Telugu Lavanya Tripati, Naga Babu, Valentine, Varuntej-Movie

శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.ఈ సినిమాలో వరుణ్ సరసన మానుషీ చిల్లర్ నటించారు.ఇకపోతే ఈ సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో వరుణ్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి ముఖ్యంగా ఈయన తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి చాలా విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

Telugu Lavanya Tripati, Naga Babu, Valentine, Varuntej-Movie

ఇటీవల నటి లావణ్య త్రిపాఠిని ( Lavanya Tripati ) వివాహం చేసుకోవడంతో చాలామంది ఈయన వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నలు అడుగుతూ వస్తున్నారు.లావణ్య త్రిపాఠి వరుణ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ పెద్దల సమక్షంలో నవంబర్ ఒకటో తేదీ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా పెళ్లి బంధంతో ఒకటైనటువంటి ఈ జంట ప్రస్తుతం తమ వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.

Telugu Lavanya Tripati, Naga Babu, Valentine, Varuntej-Movie

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఈయనకు ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఎదురైంది మీకు టాటూ( Tatoo )లు అంటే ఇష్టమా అనే ప్రశ్న ఎదురు కావడంతో తనకు టాటూ అంటే చాలా ఇష్టం అని అయితే నేను ఒక్క టాటూ కూడా వేయించుకోలేదని తెలిపారు.నాకు టాటూ వేయించుకోవడం అంటే చాలా భయం అంటూ ఈ సందర్భంగా వరుణ్ చెప్పినటువంటి సమాధానం వైరల్ గా మారింది.అంతేకాకుండా మీరు చాలా హైట్ ఉంటారు.హీరోయిన్లు నటించాలంటే ఇబ్బందులు పడతారా అనే ప్రశ్న కూడా ఎదురయింది.ఈ ప్రశ్నకు వారిని సమాధానం చెబుతూ తాను ఆరడుగుల 4 అంగుళాలు ఉన్నానని తెలిపారు.అయితే హీరోయిన్స్ తన పక్కన నటించాలి అంటే చాలా ఇబ్బంది పడతారని తాను కూడా వారి హైట్ కు అనుగుణంగా నటించడం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది అంటూ ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తన హైట్ గురించి సినిమాలలో నటించే సమయంలో పడే ఇబ్బందుల గురించి తెలియజేస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube