Priyamani : మరో కొత్త కారును కొనుగోలు చేసిన స్టార్ హీరోయిన్ ప్రియమణి.. కారు ఖరీదెంతంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియమణి( Priyamani) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకునే ప్రియమణి, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన వెబ్ సిరీస్ లు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది.

 Priyamani Who Bought An Expensive Car Do You Know The Price-TeluguStop.com

ఇటు వెండితెరపై.అటు ఓటీటీలలో వరుసగా దుమ్మురేపుతోంది.

సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ఇంతకు ముందుకంటే కూడా ఇప్పుడు బిజీగా ఉంటుంది.అంతేకాదు రీసెంట్ గా బాలీవుడ్( Bollywood ) ఎంట్రీ కూడా ఇచ్చేసింది సీనియర్ బ్యూటీ.

జవాన్ సినిమా( Jawan movie )తో బాలీవుడ్ లో భారీ హిట్ ను సొంతం చేసుకుంది.అంతే కాదు ఓటీటీలో కూడా సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ లు తో ఆడియన్స్ ను అలరిస్తోంది ప్రియమణి.తాజాగా ఆమె భామా కలాపం 2 వెబ్ సిరీస్‏తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఇప్పుడు ఈ భామ కీలకపాత్ర పోషించిన ఆర్టికల్ 370 మూవీ కూడా ప్రియమణి సక్సెస్ లిస్ట్ లో పడిపోయింది.

ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న ఆమె తాజాగా ఒక కాస్ట్లీ కార్ ను కొనుగోలు చేసింది.జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ ని కొనుగోలు చేసింది ప్రియమణి.

ఈ కారు ధర దాదాపు 74 లక్షల వరకు ఉంది.అయితే కాస్ట్లీ కార్లు ప్రియమణికి కొత్తేమి కాదు.ఇప్పటికే ఆమె గ్యారేజ్ లో బొలెడు కాస్ట్ లీ కార్లు ఉన్నాయట.ఇక ఇ్పపుడు అందులో మరో ఖరీదైన లగ్జరీ కారు వచ్చి చేరింది.ఆ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube