యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ ( NCA ) తాజాగా రికార్డు స్థాయిలో కొకైన్‌ను పట్టుకుంది.అది కూడా అరటి పండ్లను తరలించే పెట్టెల్లో దొరకబుచ్చుకుంది.
ఇప్పుడు ఈ ఘటన ఆ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.క్రైమ్ ఏజెన్సీ తనిఖీలు చేస్తూ ఇటీవల ఏకంగా 5.7 టన్నుల కొకైన్( Cocaine )ను గుర్తించింది.దాంతో షాకవ్వడం అధికారుల వంతయింది.
అనంతరం వీటిని స్వాధీనం చేసుకున్నారు.ఈ కొకైన్ విలువ దాదాపు £450 మిలియన్లు లేదా రూ.4,700 కోట్లకు పైగా ఉంటుంది.ఇంత విలువైన కొకైన్‌ని ఎవరు గుర్తుపట్టకూడదని అరటి డబ్బాల్లో దాచిపెట్టారు.

అయితే వీటిని తరలిస్తున్న వాహనాన్ని ఫిబ్రవరి 8న సౌతాంప్టన్ పోర్ట్‌లో అధికారులు ఆపేశారు.అలా వీరి బాగోతం బయటపడింది.వాటిని జర్మనీలోని హాంబర్గ్‌కు రవాణా చేసి, ఆపై మరింత పంపిణీ చేయాల్సి ఉంది.చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా యూకేలోని క్రిమినల్ గ్రూపులు ఏటా దాదాపు £4 బిలియన్లు సంపాదిస్తున్నాయని NCA విశ్వసిస్తోంది.
ఈ మాదకద్రవ్యాల వ్యాపారాలు చేస్తున్నవారు హత్యలు కూడా ఎక్కువగానే చేస్తుంటారు.ఇంకా వారు చేసే నేరాలకు హద్దే లేదు.డ్రగ్స్ యూరప్ వైపు వెళ్లినప్పటికీ, ఎక్కువ భాగం స్థానిక ముఠాల ద్వారా యూకేలో విక్రయించడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

NCA డ్రగ్స్ స్మగ్లింగ్‌పై దృష్టి సారించింది.అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయడానికి కృషి చేస్తోంది.ఇతర దేశాల్లోని చట్ట అమలు సంస్థలతో సహకారం వారి ప్రయత్నాలకు కీలకం.దీనికి ముందు, యూకేలో 2022లో సౌతాంప్టన్‌లో 3.7 టన్నుల కొకైన్ అతిపెద్ద మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది.అంతకుముందు కూడా, 2015లో, స్కాట్‌లాండ్( Scotland )లోని ఒక పడవలో 3.2 టన్నులు కనుగొనబడ్డాయి.2015లో స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ 5.12 కోట్ల పౌండ్లు (రూ.538 కోట్లు).