Elephants Viral Video : వీడియో: ఏనుగును రెచ్చగొట్టిన ప్రజలు.. మండిపడ్డ ఐఎఫ్ఎస్ అధికారి..

మానవ ప్రాంతాల్లోకి వన్యప్రాణులు ప్రవేశిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.ఇది ఆందోళన కలిగిస్తోంది.

 Viral Video Man Pokes Elephant With A Stick-TeluguStop.com

అటవీ నిర్మూలన, పట్టణ విస్తరణ కారణంగా జంతువుల సహజ ఆవాసాలు కనుమరుగు అవుతున్నాయి.దీనిని ఫలితంగా, ఏనుగులతో( Elephants ) సహా అనేక అడవి జంతువులు ఆహారం కోసం వెతుకుతూ పొలాలు, నివాస ప్రాంతాలలోకి వస్తున్నాయి.

దీంతో మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి.

అలాంటి ఎన్‌కౌంటర్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తరచుగా వైరల్ అవుతున్నాయి.ఈ వీడియోల్లో మానవులు జంతువులను అనవసరంగా రెచ్చగొట్టడం ఎక్కువగా కనిపిస్తోంది.తాజాగా వైరల్‌గా మారిన వీడియోలో కూడా మానవులు, ఏనుగులను కావాలనే రెచ్చగొట్టారు.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(IFS) అధికారి సురేంద్ర మెహ్రా( Surender Mehra ) షేర్ చేసిన ఈ ఫుటేజీలో ఇద్దరు వ్యక్తులు ఆకలితో ఉన్న ఏనుగును కర్రతో వెక్కిరిస్తున్నట్లు కనిపిస్తోంది.తరువాత ఏనుగు వారిని చంపేయడానికి పరిగెత్తుకుంటూ దూసుకొచ్చింది.

వారు ప్రాణాలను రక్షించుకోవడానికి అక్కడి నుంచి ఉరికారు.

ఏనుగు నుంచి పంటలను రక్షించడానికి వారు ఈ పని చేసినట్లు తెలుస్తోంది.పంటలను రక్షించుకునే హక్కు వారికి ఉంది కానీ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే వాటి చేతిలో చనిపోయే ప్రమాదం ఉంది. వైరల్ వీడియోలోని( Viral Video ) ప్రజల నిర్లక్ష్య ప్రవర్తనను ఐఎఫ్ఎస్ అధికారి విమర్శించారు, అటువంటి చర్యలు తీవ్రమైన మానవ-జంతు సంఘర్షణలకు దారితీస్తాయని హెచ్చరించారు.

వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు కూడా వారి ప్రవర్తనపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, కఠినమైన పరిణామాలు తప్పవని వార్న్ చేశారు.ఏనుగులను పంటల నుంచి తరిమికొట్టాలనే ఉద్దేశ్యమే వారికి ఉంటే, ఈ పద్ధతిని ఆశ్రయించడం సరికాదని, ఇది చాలా ప్రమాదకరమైనదని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube