Elephants Viral Video : వీడియో: ఏనుగును రెచ్చగొట్టిన ప్రజలు.. మండిపడ్డ ఐఎఫ్ఎస్ అధికారి..

మానవ ప్రాంతాల్లోకి వన్యప్రాణులు ప్రవేశిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.ఇది ఆందోళన కలిగిస్తోంది.

అటవీ నిర్మూలన, పట్టణ విస్తరణ కారణంగా జంతువుల సహజ ఆవాసాలు కనుమరుగు అవుతున్నాయి.

దీనిని ఫలితంగా, ఏనుగులతో( Elephants ) సహా అనేక అడవి జంతువులు ఆహారం కోసం వెతుకుతూ పొలాలు, నివాస ప్రాంతాలలోకి వస్తున్నాయి.

దీంతో మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. """/" / అలాంటి ఎన్‌కౌంటర్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తరచుగా వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోల్లో మానవులు జంతువులను అనవసరంగా రెచ్చగొట్టడం ఎక్కువగా కనిపిస్తోంది.తాజాగా వైరల్‌గా మారిన వీడియోలో కూడా మానవులు, ఏనుగులను కావాలనే రెచ్చగొట్టారు.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(IFS) అధికారి సురేంద్ర మెహ్రా( Surender Mehra ) షేర్ చేసిన ఈ ఫుటేజీలో ఇద్దరు వ్యక్తులు ఆకలితో ఉన్న ఏనుగును కర్రతో వెక్కిరిస్తున్నట్లు కనిపిస్తోంది.

తరువాత ఏనుగు వారిని చంపేయడానికి పరిగెత్తుకుంటూ దూసుకొచ్చింది.వారు ప్రాణాలను రక్షించుకోవడానికి అక్కడి నుంచి ఉరికారు.

"""/" / ఏనుగు నుంచి పంటలను రక్షించడానికి వారు ఈ పని చేసినట్లు తెలుస్తోంది.

పంటలను రక్షించుకునే హక్కు వారికి ఉంది కానీ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే వాటి చేతిలో చనిపోయే ప్రమాదం ఉంది.

వైరల్ వీడియోలోని( Viral Video ) ప్రజల నిర్లక్ష్య ప్రవర్తనను ఐఎఫ్ఎస్ అధికారి విమర్శించారు, అటువంటి చర్యలు తీవ్రమైన మానవ-జంతు సంఘర్షణలకు దారితీస్తాయని హెచ్చరించారు.

వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు కూడా వారి ప్రవర్తనపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, కఠినమైన పరిణామాలు తప్పవని వార్న్ చేశారు.

ఏనుగులను పంటల నుంచి తరిమికొట్టాలనే ఉద్దేశ్యమే వారికి ఉంటే, ఈ పద్ధతిని ఆశ్రయించడం సరికాదని, ఇది చాలా ప్రమాదకరమైనదని సూచించారు.

నిన్నటిదాకా రూ.300కి పనిచేసిన కూలీ.. పెద్ద డైమండ్ దొరకడంతో రాత్రికి రాత్రే..??