వివాహం అనంతరం చాలా మంది మహిళలకు బాన పొట్ట వస్తుంటుంది.ఇందుకు ప్రధాన కారణం ప్రెగ్నెన్సీ.
గర్భం దాల్చడం వల్ల పొట్ట సాగుతుంది.డెలివరీ తర్వాత సాగిన పొట్టను మళ్లీ బిగుతుగా మార్చుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ పొడి మీకు ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.డెలివరీ తర్వాత రోజు ఇప్పుడు చెప్పబోయే పోటీని తీసుకుంటే సాగిన పొట్ట( stomach ) కొద్దిరోజుల్లోనే సూపర్ టైట్ గా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మిరాకిల్ పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో నాలుగు టేబుల్ స్పూన్లు జీలకర్ర,( cumin ) నాలుగు టేబుల్ స్పూన్లు వాము కూడా వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న జీలకర్ర, వాము, అవిసె గింజల తో పాటు ఐదు నుంచి ఆరు మిరియాలు( Six peppers ), చిటికెడు ఉప్పు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ప్రతిరోజు ఉదయం తయారు చేసుకున్న పొడిని ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి.ఆపై హాఫ్ లీటర్ వరకు గోరువెచ్చని నీటిని సేవించాలి.
అవిసె గింజలు, జీలకర్ర, వాము, మిరియాలు వీటన్నిటిలో ఫ్యాట్ కట్టర్ ప్రాపర్టీస్ నిండి ఉంటాయి.వీటిని పొడిగా చేసుకుని తీసుకోవడం వల్ల పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరుగుతుంది.

అలాగే డెలివరీ తర్వాత సాగిన పొట్ట సైతం బిగుతుగా మారుతుంది.కాబట్టి ప్రసవం అనంతరం పొట్టను టైట్ గా మార్చుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ పొడిని తీసుకోండి.పైగా ఈ పొడి వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.ఎముకలను బలంగా మారుస్తుంది.మోకాళ్ళ నొప్పులను దూరం చేస్తుంది.మరియు జీర్ణ సంబంధిత సమస్యలకు సైతం చెక్ పెడుతుంది.







