హువాయ్ పాకెట్ 2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్( Huawei Pocket 2 foldable smart phone ) చైనా మార్కెట్లో లాంచ్ అయింది.స్మార్ట్ ఫోన్ వెనుక 4 కెమెరా యూనిట్లతో లాంచ్ చేసిన మొట్టమొదటి క్లామ్ షెల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఇదే.
ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలు ఏమిటో చూద్దాం.
హువాయ్ పాకెట్ 2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్:
ఈ ఫోన్ ఇంటర్నల్ డిస్ ప్లే 2690*1136 పిక్సెల్ రిజల్యూషన్ తో 6.94 అంగుళాల LTOP OLED ప్యానెల్ తో ఉంటుంది.120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, PWM డిమ్మింగ్ రేట్ 1440Hz, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2200 నిట్స్ బ్రైట్ నెస్, 360*360 పిక్సెల్ రిజల్యూషన్ తో 1.15 అంగుళాల OLED ప్యానల్( OLED panel ) ను ఉపయోగిస్తుంది.50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగా పిక్సెల్ సెన్సార్,8 మెగా పిక్సెల్ టెలిఫోటో షూటర్, 2 మెగా పిక్సెల్ హైపర్ స్పెక్ట్రల్ కెమెరా తో ఉంటుంది.10.7 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ తో ఉంటుంది.4520 mAh బ్యాటరీ సామర్థ్యం ( 4520 mAh battery capacity )తో 66W వైర్డ్, 40W వైర్ లెస్, 7.5W వైర్ లెస్ రివర్స్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.
ఫోన్ డ్యూయల్ బ్యాండ్ wifi, బ్లూ టూత్ 5.2, NFC, USB టైప్-C కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది.స్ప్లాష్ నిరోధకత కోసం IPX8 రేటింగ్ ను పొందుతుంది.ఫోన్ హ్యాండ్ సెట్ 1.15 అంగుళాల కవర్ డిస్ ప్లే ను కలిగి ఉంటుంది.ఎలిగేంట్ బ్లాక్, రోకోకో వైట్, తహితియన్ గ్రే, టారో పర్పుల్ రంగులలో ఉంటుంది.12GB RAM+ 256GB వేరియంట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.86400, 512GB స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.92200.16GB RAM+ 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.126800 గా ఉంది.