నల్లగొండ జిల్లా: జిల్లాలోని దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును రేపు(శుక్రవారం) రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మంత్రి భట్టి విక్రమార్క జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సందర్శించనున్నారు.ఉదయం 8గంటలకు ప్రజాభవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి దామరచర్లకు 10.30 గంటలకు చేరుకుంటారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును సందర్శించి అక్కడ జరుగుతున్న పురోగతి పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష చేస్తారు.
తిరిగి మధ్యాహ్నం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరుతారు.