అమరావతి( Amaravati )లో టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ భేటీ అయింది.రెండు పార్టీల నుంచి సమావేశానికి కమిటీ సభ్యులు హాజరయ్యారు.
ఇందులో ప్రధానంగా ఉమ్మడి మ్యానిఫెస్టో ( Manifesto )రూపకల్పనతో పాటు ఎన్నికల ప్రచారంపై చర్చించనున్నారు.
అదేవిధంగా ఈనెల 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించే అంశంపై కూడా నేతలు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా ఈ ఉమ్మడి బహిరంగ సభకు ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్( Chandrababu , Pawan Kalyan ) హాజరుకానున్నారు.కాగా ఈ సభను ఎక్కడ నిర్వహించాలనే అంశంపై ఈ సమన్వయ కమిటీ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.