బిగ్ బాస్ షో సీజన్7 ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో అర్జున్ అంబటి ఒకరు.అర్జున్ అంబటి సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్నారు.
బిగ్ బాస్ షో ద్వారా అర్జున్ అంబటి( Arjun ambati )కి భారీ స్థాయిలో పారితోషికం దక్కిందని సమాచారం అందుతోంది.తన పెళ్లి రోజు సందర్భంగా అర్జున్ అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు.

పెళ్లిరోజును తలచుకుంటూ తన భార్యకు అర్జున్ అంబటి శుభాకాంక్షలు తెలియజేశారు.పొరపాటున ఒక్కరోజు ఒక చుక్క చూపించానని కానీ నాకు మాత్రం జీవితాంతం చుక్కలు చూపిస్తున్నావని అర్జున్ అంబటి చెప్పుకొచ్చారు.మనకు ప్రత్యేకమైన రోజున శుభాకాంక్షలు అంటూ అర్జున్ అంబటి వెల్లడించడం గమనార్హం.బుధవారం రోజున అర్జున్ సురేఖ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు.అర్జున్ అంబటి చేసిన పోస్ట్ కు ఏకంగా 75 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.అర్జున్ అంబటి త్వరలో ఒక సినిమాలో హీరోగా నటించబోతున్నారని తెలుస్తోంది.
అర్జున్ అంబటిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా అర్జున్ అంబటి హీరోగా సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.అర్జున్ అంబటి బుల్లితెర షోలు, సీరియల్స్ తో బిజీగా ఉన్నారు.
అర్జున్ భార్య సురేఖ( Surekha ) జనవరి నెల 9వ తేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అర్జున్ అంబటి కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే కెరీర్ పరంగా మరింత సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అర్జున్ అంబటి తన కూతురికి ఆర్ఖా( Arkha ) అని పేరు పెట్టారు.స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న పలు షోలలో అర్జున్ అంబటి సందడి చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
అర్జున్ అంబటి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.అర్జున్ అంబటిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.







