Mega Family : మెగా హీరోలు అందరిలో ఉన్న ఈ కామన్ పాయింట్ గుర్తించారా.. ఫ్యామిలీ మొత్తానికి అదే జబ్బు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టినటువంటి వారిలో నటుడు మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఒకరు.ఈయనకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేదు.

 Do You Know What Is The Common Quality In All Mega Heroes Total Family Family H-TeluguStop.com

నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడంతో ఈయన వారసులగా ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

ఇక మెగా ఫ్యామిలీ( Mega Family ) నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారు కొందరు పాన్ ఇండియా స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకోక మరికొందరు టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు పొందరు.అయితే కొంతమంది హీరోలు ఇంకా సక్సెస్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

స్టార్ సినీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన వారందరూ కూడా స్టార్స్ కాలేరని వారిలో టాలెంట్ ఉంటేనే సక్సెస్ కాగలరని మెగా హీరోలు( Mega heroes ) నిరూపిస్తున్నారు.ఇలా మెగా ఫ్యామిలీలో కొంతమంది పాన్ ఇండియా రేంజ్ లో ఉండగా మరికొందరు తెలుగు చిత్ర పరిశ్రమలోనే సక్సెస్ కాలేకపోతున్నారు.

ఇదిలా ఉండగా కదా మెగా హీరోల గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మెగా కుటుంబంలోని హీరోలకు ఒక వింత జబ్బు ఉంది అంటూ ఈ వార్త వైరల్ అవుతుంది.

మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొని పంజా వైష్ణవ్ వరకు కూడా అదే జబ్బు మెగా హీరోలలో ఉన్నటువంటి కామన్ క్వాలిటీ గురించి ఈ వార్త వైరల్ గా మారింది.మరి ఈ హీరోలలో ఉన్నటువంటి ఆ కామన్ క్వాలిటీ ఏంటి అనే విషయానికి వస్తే.

మెగా హీరోల గురించి ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసిన వారు మాత్రం ఏ ఇంటర్వ్యూలలోను ఆ ఘటనలపై సీరియస్ అయిన దాఖలాలు అసలు లేవు.

Telugu Commonquality, Heros, Tollywood-Movie

వీరి గురించి ఎన్నో రకాల ట్రోల్స్ వచ్చిన నవ్వుతూనే ఉంటారు తప్ప ఆ విమర్శలపై స్పందించరని చెప్పాలి అయితే నాగబాబు ( Nagababu ) పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగానే ఉండేవారు ఎలాంటి వివాదాలకు వెళ్లేవారు కాదు కానీ ఇటీవల వీరిద్దరూ రాజకీయాలలోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయంగా విమర్శలు చేస్తారు కానీ సినిమాల పరంగా తమను ఎవరైనా విమర్శిస్తే మాత్రం అసలు సీరియస్ కారని చెప్పాలి.ఇలా తన ఫ్యామిలీ గురించి ఎంతోమంది ట్రోల్స్ చేసిన కూడా మెగా హీరోలు నోరు విప్పకపోవడమే వీరందరిలో ఉన్నటువంటి కామన్ క్వాలిటీ అంటూ ఈ వార్త వైరల్ గా మారింది.

Telugu Commonquality, Heros, Tollywood-Movie

ఇక చాలా సందర్భాలలో వీరి వ్యక్తిగత విషయాల గురించి కూడా ట్రోల్స్ వచ్చాయి అంతేకాకుండా వీరి ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ఈ ట్రోల్స్ లోకి లాగారు అయినప్పటికీ మెగా హీరోలు మాత్రం ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు.ఇలా చేతకాక స్పందించలేదనే దానికంటే అనవసర విషయాలలో స్పందించకూడదని తెలిసినటువంటి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అంటూ ఈ వార్త వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube