Aryan Bharath : 3D ప్రింటర్ పరికరంతో జిలేబీలు వేస్తున్న పాకిస్థాన్ వ్యక్తి.. వీడియో వైరల్..

ఇండియాలో జిలేబీలు( Jalebis ) ఎంత పాపులర్ అయ్యాయో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.వీటిని గుండ్రంగా తయారు చేసేందుకు చేతి వేళ్ళను ఉపయోగిస్తారు.

 Video Of Pakistani Man Making Jalebis With 3d Printer Device Goes Viral-TeluguStop.com

అయితే ఒక వ్యక్తి మాత్రం కొత్త విధానం కొనుగొన్నాడు.అతడు జిలేబీలను వెరైటీగా తయారు చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఫైసలాబాద్‌లో ఓ స్వీట్ షాప్ కి ఓనర్ ఇతడు.పాకిస్థాన్‌కు చెందిన ఈ వీధి వ్యాపారి గుండ్రంగా, క్రిస్పీగా ఉండే జిలేబీలు తయారు చేయడానికి 3D ప్రింటర్ నాజిల్‌ను( 3D printer nozzle ) ఉపయోగించాడు.

మాములుగా ఈ నాజిల్‌తో జిలేబీలు తయారు చేయాలనే ఆలోచన ఎవరికీ రాదు.అందుకే ఈ వాడకాన్ని చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.

ఈ క్రియేటివ్ ప్రిపరేషన్‌కు సంబంధించిన వీడియోను ఆర్యన్ భరత్( Aryan Bharath ) అనే యూజర్ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్నారు.జిలేబీలను తయారు చేసేందుకు 3D ప్రింటర్ నాజిల్‌ని ఉపయోగించడం చూసి తాను ఆశ్చర్యపోయానని క్యాప్షన్ రాశాడు.

అతని పోస్ట్ ఇతర చాలా నెటిజెన్ల దృష్టిని ఆకర్షించింది, వారు దుకాణ యజమాని చాలా క్రియేటివ్ అని ప్రశంసించారు.షాపు యజమానిని అతని ప్రాంతంలో పిప్పల్ బాటా జలేబీ వాలా( Pippal Bata Jalebi Wala ) అని పిలుస్తారట.

జిలేబీల స్పైరల్ ఆకారాన్ని తయారు చేయడానికి మనిషి 3D ప్రింటర్ నాజిల్‌ను ఉపయోగిస్తున్నట్లు వైరల్ వీడియోలో మనం చూడవచ్చు.ఆపై అతను వాటిని చక్కెర సిరప్‌లో ముంచి వేడిగా అందిస్తాడు.నాజిల్ జిలేబీల వేగంగా, ఒకే ఆకారంగా గుండ్రంగా చేయడానికి అతనికి సహాయపడుతుంది.

భారతదేశానికి చెందిన చాలా మంది వినియోగదారులు ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోయారు.అందులో ఒకతను “రోబోటిక్ జలేబీ” ( Robotic Jalebi )అని పిలిచి, ఈ నాజిల్ ఎక్కడ దొరుకుతుందో చెప్పాలని అడిగాడు.దీన్ని తన రోబోటిక్ చేతికి జోడించాలనుకుంటున్నానని, టెక్నాలజీకి ఇదో పెద్ద అచీవ్ మెంట్ అని చెప్పాడు.3D ప్రింటర్ నాజిల్ అనేది పంపు, ట్యాంక్, ఫుడ్ గ్రేడ్ నాజిల్, పైపు, సర్క్యూట్‌తో కూడిన సాధారణ పరికరం అని ఒకరు పేర్కొన్నారు.ఈ ఆశ్చర్యపరిచే వీడియోను మీరు చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube