నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ( YCP )కి షాక్ తగిలింది.జిల్లాలోని కీలక నేత, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( MP Vemireddy Prabhakar Reddy ) పార్టీని వీడారు.
ఈ మేరకు జిల్లా అధ్యక్ష పదవితో పాటు వైసీపీ పార్టీ సభ్యత్వానికి వేమిరెడ్డి రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలోనే తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా సీఎం జగన్( CM Jagan ) కు పంపించారు.అనంతరం రాజ్యసభ సభ్యత్వానికి సైతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు.అయితే వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.