Etela Rajendar : ఎంపీ గా ‘ ఈటెల ‘ పోటీ .. సీటు పై క్లారిటీ

తెలంగాణ బిజెపిలో కీలక నేతగా ఉన్న హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్( Etela rajendar ) ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చెందారు.దీంతో అప్పటి నుంచి రాజేందర్ హవా బీజేపీ లో తగ్గినట్టుగానే కనిపిస్తోంది.

 Etela Rajendar Competition As Mp Clarity On The Seat-TeluguStop.com

అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో రాజేందర్ ఉన్నారు.దీనిలో భాగంగానే తాను పోటీ చేయబోయే నియోజకవర్గం విషయంలో ముందుగానే రాజేందర్ క్లారిటీ ఇచ్చారు.

ఈ రోజు యాదగిరిగుట్టలో ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేయబోతున్నామని, పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అన్నారు.

వాస్తవంగా మల్కాజి గిరి నుంచి పోటీ చేసేందుకు ఈటెల రాజేందర్ ఆసక్తి చూపిస్తున్నారు.

Telugu Congress, Etela Rajendar, Hujurabad, Malkajigirimp, Prajasankalpa, Telang

ఈ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే అంచనాతో ఆయన ఉన్నారు.అందుకే ఈ సీటు విషయంలోనే పార్టీ అధిష్టానం పైన ఆయన ఒత్తిడి చేస్తున్నారు.ఇదిలా ఉంటే.

యాదగిరిగుట్టలో నిర్వహించిన ప్రజా సకల్ప యాత్ర( Praja Sankalpa Yatra )లో అనేక అంశాలపై రాజేందర్ మాట్లాడారు.తమకు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదని అన్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై రాజేందర్ విమర్శలు చేశారు.మేడిగడ్డపై సిబిఐ విచారణ కోరిన కాంగ్రెస్, అధికారం వచ్చాక మాట మార్చిందని, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి తప్పుదోవ పట్టించే హామీలు ఇచ్చిందని రాజేందర్ మండిపడ్డారు.

కాంగ్రెస్ హామీలపై ప్రజల భ్రమలు తొలగుతున్నాయని, ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య, ఆక్వాఫెన్సీ పెరిగినప్పటికీ బస్సుల సంఖ్య పెరగలేదని రాజేందర్ విమర్శించారు.

Telugu Congress, Etela Rajendar, Hujurabad, Malkajigirimp, Prajasankalpa, Telang

కాంగ్రెస్ హామీలపై ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకున్నారా అంటూ రాజేందర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి( Revanth Reddy ) అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, హామీలు ఇవ్వకుండానే అమలు చేసిన గొప్ప వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని రాజేందర్ అన్నారు.6,300 కోట్ల రూపాయలతో మూతపడిన ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని తిరిగి ప్రారంభించారని రాజేందర్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube