Redmi 13C : రెడ్ మీ 13C స్మార్ట్ ఫోన్ లాంచ్.. ధర తక్కువ-ఫీచర్లు ఎక్కువ..!

రెడ్ మీ 13C స్మార్ట్ ఫోన్( Redmi 13C smart phone ) తక్కువ బడ్జెట్లో మైమరిపించే అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ అయింది.ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

 Redmi 13c : రెడ్ మీ 13c స్మార్ట్ ఫోన్ లా-TeluguStop.com

రెడ్ మీ 13C స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్ 6.74 అంగుళాల LCD స్క్రీన్( LCD screen ) తో ఉంటుంది.90Hz రిఫ్రెష్ రేట్ కు మద్దతు ఇస్తుంది.స్క్రోలింగ్ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది.ఈ ఫోన్ ప్లాస్టిక్ బాడీ, బాక్సీ డిజైన్ తో వస్తుంది.600 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది.ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ఎస్ఓసీ ద్వారా పని చేస్తుంది.ఆండ్రాయిడ్ 13 ఆధారంగా MIUI 14 పై రన్ అవుతోంది.5000mAh బ్యాటరీ సామర్థ్యంతో 10w ఫాస్ట్ ఛార్జింగ్ కు వస్తుంది.

ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, సెల్ఫీల కోసం 5 ఎంపీ ఏఐ కెమెరా( 5 MP AI camera )తో ఉంటుంది.ఈ ఫోన్ తేలికగా, వెనుక ప్యానల్ వద్ద ఉన్న గ్రేడియంట్ ముగింపు దీనికి మంచి రూపాన్ని ఇస్తుంది.

ఈ ఫోన్ లో ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉన్నాయి.ఈ ఫోన్ ఇండోర్ ఉపయోగం కోసం తగినంత ప్రకాశవంతంగా ఉంటుంది.ధర పరంగా చూసుకుంటే ఈ ఫోన్ మంచి డిస్ ప్లే తో వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఈ ఫోన్ సబ్ వే సర్ఫర్ లాంటి తేలికపాటి గేమ్లను ఆడేందుకు అనుమతిస్తుంది.

ఇక ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ కావడానికి రెండు గంటల సమయం పడుతుంది. ఈ ఫోన్ కెమెరా తక్కువ కాంతి పరిస్థితుల్లో సగటు చిత్రాలను హై లైట్ అవుతాయి.రూ.12 వేల బడ్జెట్ లో మంచి ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి రెడ్ మీ 13C స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube