ముఖ్యంగా చెప్పాలంటే నాభి మన శరీరంలో ఎంతో ముఖ్యమైన భాగం అని దాదాపు చాలామందికి తెలుసు.నాభి అనేది శరీరంలోని అన్ని అవయవాలను కలిపే ప్రధాన అవయవం.
కాబట్టి దీనిని శరీరం యొక్క శక్తి కేంద్రం అని కూడా అంటారు.కాబట్టి ఇంటి పెద్దలు నాభి పైన నూనె రాయమని సలహా ఇవ్వడం, మీరు చాలా సార్లు వినే ఉంటారు.
నాభి నూనెను అప్లై చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.వివిధ రకాల నూనెలను నాభి పైన రాయడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ముఖ్యంగా మహిళలు దీనివల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు.ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం మహిళలకు నాభి పై ఆముదం రాసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకు నాభి పైన ఆముదం రాయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఆయుర్వేదం లో నాభి శరీరం యొక్క ప్రధాన శక్తి కేంద్రంగా పరిగణిస్తారు.నాభి పై నూనె రాసుకోవడం వల్ల శరీరానికి ఉపశమనం మరియు పోషణ లభిస్తుంది.ఇది అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.నాభికి ఆముదం రాయడం వల్ల జీర్ణశక్తి( Digestive system ) మెరుగుపడుతుంది.ఇది మలబద్ధకం మరియు జీర్ణ క్రియకు సంబంధించిన ఇతర సమస్యలను దూరం చేస్తుంది.
ఇందులోని పీచు పదార్థం పొట్టకు మేలు చేస్తుంది.మహిళలు బహిష్టు సమయంలో కడుపు మరియు వెన్నునొప్పి సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు.
నాభి లో ఆముదం రాసుకోవడం వల్ల రుతు క్రమంలో వచ్చే నొప్పి ఇతర సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
అలాగే ఉబ్బరం నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే స్త్రీలకు యోని పొడి బారిన సమస్య ఉంటుంది.
ఆముదం ఈ సమస్యను కూడా దూరం చేస్తుంది.నాభి పై ఆముదం రాసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు( Joint pains కూడా తగ్గుతాయి.
జుట్టుకు ఆముదం రాసుకోవడం వల్ల జుట్టు పొడవు మరియు ఒత్తుగా పెరుగుతుంది.ఒక చెంచా ఆముదం, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మరియు అర చెంచా నిమ్మరసం( Lemonade ) మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
నాభి పై ఆముదం ఎలా రాసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.నాభి లో రెండు నుంచి మూడు చుక్కల ఆముదం వేయాలి.
ఆ తర్వాత నాభినీ సున్నితంగా మసాజ్ చేయాలి.ఈ నూనెను రాత్రంతా అలాగే ఉంచాలి.