తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ( BRS party ) త్వరలో నీటి పోరు యాత్ర చేపట్టనుంది.కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో పాదయాత్రలు చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధం అయిందని తెలుస్తోంది.
నాగార్జున సాగర్, కాళేశ్వరం నుంచి నీటిపోరు యాత్ర ప్రారంభించాలని భావిస్తోన్న బీఆర్ఎస్ యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ యాత్రలను లోక్ సభ ఎన్నికలకు( Lok Sabha elections ) ముందే ప్రారంభించాలని యోచిస్తోందని తెలుస్తోంది.అయితే ఇటీవల కృష్ణా ప్రాజెక్టులు( Krishna Projects ) కేఆర్ఎంబీకి అప్పగించడంపై నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.