Snake Rescue : బావిలో పడిపోయిన పామును వట్టి చేతులతో రక్షించిన వ్యక్తి.. వీడియో వైరల్..

సాధారణంగా పాములను చూస్తే చాలా భయం వేస్తుంది.అదే అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను దగ్గర నుంచి చూస్తే పైప్రాణాలు పైనే కలిసిపోతాయి.

 A Man Saved A Snake That Fell In A Well With His Hands Video Viral-TeluguStop.com

అవి చాలా భయంకరమైన రూపంతో గుండెల్లో గుబులు రేపుతుంటాయి.అయితే ఓ యువకుడు మాత్రం కింగ్ కోబ్రా( king cobra )ని చూసి అసలు భయపడలేదు.

బావిలో నుంచి కింగ్ కోబ్రాను అతడు చాలా ధైర్యంగా పట్టుకున్నాడు.అది బావిలో పడి బయటికి రాలేక ఇబ్బంది పడుతుంటే దానిని వట్టి చేతులతో పట్టుకొని బయటేశాడు.

ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ గా మారింది.ఇది విపరీతంగా లైక్స్ పొందుతోంది.

ముందుగా చెప్పుకున్నట్లు కింగ్ కోబ్రా చాలా ప్రమాదకరమైన పాము, ఇది తన విషంతో ప్రజలను నిమిషాల వ్యవధిలో చంపగలదు.చాలా మంది పాములను చూసి భయపడి పారిపోతారు.

అయితే ఆ యువకుడు బెదరలేదు.చేయి చాచి నీళ్లలోంచి పాము( Snake )ను పట్టుకున్నాడు.పాము అతన్ని కాటు వేయడానికి ప్రయత్నించింది, కానీ అతను జాగ్రత్తగా, పాము తోకను పట్టుకున్నాడు.అతను పాము నోటిని తన శరీరానికి దూరంగా ఉంచాడు.దీన్ని చాలా ధైర్యంగా చేశాడు.ఇన్‌స్టాగ్రామ్‌లో 89,000 మందికి పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న సాగర్ పాటిల్( Sagar Patil ) ఈ వీడియోను పోస్ట్ చేశారు.

అతను పాములను రక్షించడం, అడవి ప్రాంతాల్లో వదిలేయడం వంటి పనులు చేస్తాడు.ఇలా చేస్తున్న వీడియోలను తరచూ షేర్ చేస్తుంటాడు.

పాములు నీటిలో ఈదగలవు.కింగ్ కోబ్రాస్ ఈత కొట్టడంలో చాలా నైపుణ్యాన్ని కలిగి ఉంటాయి.అవి నీటిలో జీవులను పట్టుకుని తినవచ్చు.కొన్నిసార్లు నదులు, చెరువులను ఈదుకుంటూ వేటాడుతాయి.వీడియోలో ఉన్న పాము బావిలో మునగడం లేదు.కానీ సాగర్ పాటిల్ బావిని ఉపయోగించుకునే వ్యక్తులను రక్షించడానికి దానిని బావి నుంచి తీసి ఉండవచ్చు.

లేదంటే ఆ పాము భావించి బయటికి రాలేకపోయి ఉండొచ్చు.అతను పాములను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాడో లేదో తెలియ రాలేదు.

ముఖ్యంగా విషం ఉన్న పాములకు ప్రజలు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube